- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SEBI: పెద్ద కంపెనీలకు ఐపీఓ నిబంధనలను సడలించిన సెబీ
పబ్లిక్ ఇష్యూలలో యాంకర్ పెట్టుబడిదారుల కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బోర్డు శుక్రవారం పలు కీలకమైన సంస్కరణలకు ఆమోదం తెలిపింది. ఐపీఓ నిబంధనలు, విదేశీ పెట్టుబడిదారులకు సరళీకృత ప్రవేశం, పబ్లిక్ ఇష్యూలలో యాంకర్ పెట్టుబడిదారుల కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే అధ్యక్షతన జరిగిన మూడవ బోర్డు సమావేశంలో.. పెద్ద కంపెనీలకు కనీస ఐపీఓ అవసరాలను సడలించడం, కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలను తీర్చడానికి అవి గడువును పొడిగించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. నిబంధనల సరళీకృతం కావడం మూలంగా భారత్ పెట్టుబడుల గమ్యస్థానంగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని సెబీ భావిస్తోంది. ఇదే సమయంలో గ్లోబల్ ఫండ్ల కోసం ఐపీఓలపై ఆసక్తి పెరిగేందుకు, కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ సమయంలో యాంకర్ ఇన్వెస్టర్ల కోసం వాటాలను కేటాయించే ఫ్రేమ్‌వర్క్‌ను పునరుద్ధరించింది. అలాగే, కార్యకలాపాల పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల నియామకాన్ని తప్పనిసరి చేయడం ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజీలు, మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థల నిర్వహణ ఫ్రేమ్‌వర్క్‌ను సరిదిద్దాలని పేర్కొంది.






