- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SEBI: ఇండస్ఇండ్ బ్యాంక్ మాజీ సీఈఓ సహా ఐదుగురిపై సెబీ నిషేధం
కత్పాలియాతో పాటు బ్యాంకుకే చెందిన మరో నలుగురు సీనియర్ అధికారులను ట్రేడింగ్ చేయకుండా నిషేధం విధించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంకు క్రమంగా వివాదాల నుంచి బయటపడుతోంది. తాజాగా రూ. 3,000 కోట్లకు పైగా విలువైన అకౌంటింగ్ వ్యవహారంతో ముడిపడి ఉన్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇండస్ఇండ్ బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సుమంత్ కత్పాలియాతో పాటు బ్యాంకుకే చెందిన మరో నలుగురు సీనియర్ అధికారులను సెక్యూరిటీస్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయకుండా నిషేధం విధించింది. ఈ ఐదుగురు బ్యాంకు షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు సెబీ గుర్తించింది. దీంతో నిషేధంతో పాటు రూ. 19.78 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు షేర్లకు సంబంధించీ సున్నితమైన సమాచారాన్ని ఉపయోగించి ఈ ఐదుగురు వ్యాపారం చేశారని, ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘనే అని సెబీ ఆరోపించింది. ఇందుకు బాధ్యులను చేస్తూ వారిపై నిషేధం ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సుమంత్ కత్పాలియాతో పాటు ఇతర అధికారుల్లో ఇండస్ఇండ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానా, ట్రెజరీ ఆపరేషన్స్ హెడ్ సుశాంత్ సౌరవ్, జీఎంజీ ఆపరేషన్స్ హెడ్ రోహన్ జతన్న, కన్స్యూమర్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సీఏఓ) అనిల్ మార్కో రావు ఉన్నారు.






