Edible Oil: సోషల్ మీడియాలో రిఫైన్డ్ వంట నూనెలపై 'తప్పుదారి పట్టించే' కంటెంట్

by S Gopi |

ఆ వీడియో ఎక్కువమంది యూజర్లకు చేరుతోందని, దానివల్ల సామాన్యులు అది నిజమని నమ్మే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.

Edible Oil: సోషల్ మీడియాలో రిఫైన్డ్ వంట నూనెలపై తప్పుదారి పట్టించే కంటెంట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో శుద్ధి చేసిన వంట నూనెలకు సంబంధించి తప్పుదారి పట్టించే కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని పరిశ్రమ సమాఖ్య సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ), ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఏఐలను కోరింది. ఈ మేరకు సీసీపీఏ, ఎఫ్ఎస్ఎస్ఏఐకు లేఖ రాసింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అకౌంట్ పోస్ట్ చేసిన వైరల్ వీడియోను ఎస్ఈఏ ప్రస్తావించింది. అందులో ఆందోళన కలిగించే, కొంచెం కూడా వాస్తవం కానీ విషయాలు చెప్పారని, రిఫైన్డ్ వంట నూనెలు రసాయనాలతో నిండి ఉంటాయని, విషపూరితమనే తప్పుడు లేబులింగ్ చేస్తున్నారని పేర్కొంది. ఆ వీడియో ఎక్కువమంది యూజర్లకు చేరుతోందని, దానివల్ల సామాన్యులు అది నిజమని నమ్మే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. మనదేశంలో ఎక్కువమంది ప్రజలు వంట నూనెల్లో రిఫైన్డ్ చేసిన వాటినే వాడుతున్నారు. ఇలాంటి వీడియోల కారణంగా రిఫైన్డ్ వంట నూనెల భద్రతపై సందేహాలు నెలకొంటాయని వివరించింది. ఇలాంటి తప్పుడు సమాచారం వినియోగదారుల విశ్వాసాన్ని మాత్రమే కాకుండా రైతుల జీవనోపాధిని, దేశ ఆహార భద్రతా పర్యావరణంపై విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తుందని అసోసియేషన్ హెచ్చరించింది. ప్రజలకు ఖచ్చితమైన, శాస్త్రీయ ఆధారిత సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Next Story