- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telecos: టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఈ పిటిషన్‌లను తప్పుబడుతూ, ఈ అంశంపై కంపెనీలు కోర్టును ఆశ్రయించడాన్ని విమర్శించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిలకు సంబంధించిన వడ్డీ, జరిమానాలు, వాటిపై వడ్డీని మినహాయించాలని కోరుతూ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలిసర్వీసెస్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌లను తప్పుబడుతూ, ఈ అంశంపై కంపెనీలు కోర్టును ఆశ్రయించడాన్ని విమర్శించింది. మా ముందుకు వచ్చిన పిటిషన్‌లను చూసి షాక్ అయ్యాము. ఇది బహుళజాతి కంపెనీల నుంచి ఆశించలేదు. అందుకే కొట్టివేస్తున్నామని వొడాఫోన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి కోర్టు కూడా నిరాకరించింది.
ఆర్థిక ఇబ్బందులతో ఉపశమనం కోరిన టెల్కోలు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వొడాఫోన్ ఐడియా రూ. 45,000 కోట్లకు పైగా ఉన్న ఏజీఆర్ బకాయిల నుంచి ఉపశమనం కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. భారతీ ఎయిర్‌టెల్ కూడా సమన్యాయం కింద రాయితీలను కోరుతూ అప్పీల్ చేసింది. ఎయిర్‌టెల్ తన దాఖలులో, అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్‌తో కలిసి రూ. 34,745 కోట్ల విలువైన వడ్డీ, జరిమానాల మినహాయింపులను కోరింది. గతంలో 2020, సెప్టెంబర్ 1 నాటి ఏజీఆర్ తీర్పును తాము వ్యతిరేకించడం లేదని, జరిమానాలు, పేరుకుపోయిన వడ్డీ వల్ల కలిగే అదనపు భారం నుంచి ఉపశమనం కోరుతున్నామని కంపెనీ స్పష్టం చేసింది. మరోవైపు, వోడాఫోన్ ఐడియా దివాలా తీసే ప్రమాదంలో ఉన్నామని పేర్కొంది. కేంద్రం నుంచి సహాయం అందకపోతే 2025-26 ఆర్థిక సంవత్సరం తర్వాత కార్యకలాపాలను కొనసాగించలేమని వివరించింది. రూ. 26,000 కోట్ల ఈక్విటీ ఇన్ఫ్యూషన్, ప్రభుత్వం బకాయిలను ఈక్విటీగా మార్చినప్పటికీ బ్యాంకు నిధులను పొందడంలో ఇబ్బందులున్నాయి. తదుపరి ప్రభుత్వ జోక్యం లేకుండా, నిధులను సేకరించలేమని, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముందు దివాలా ప్రక్రియను ప్రారంభించవలసి రావచ్చని కంపెనీ కేంద్రానికి స్పష్టం చేసింది. దివాలా తీస్తే కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న 49 శాతం వాటా నిరుపయోగంగా మారుతుందని, ఇప్పటికే ఈక్విటీగా మార్చిన స్పెక్ట్రమ్ బకాయిల రూ. 1.18 లక్షల కోట్లు వృధా అవుతాయని వొడాఫోన్ ఐడియా వెళ్లడింది.
సుప్రీంకోర్టు తీర్పు కారణంగా సోమవారం వొడాఫోన్ ఐడియా షేర్లు భారీగా క్షీణించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి 8 శాతానికి పైగా పతనమై రూ. 6.75 వద్ద ఉంది.






