- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SBI: సైబర్ మోసాల అడ్డుకట్టకు ప్రత్యేక నంబర్లు విడుదల చేసిన ఎస్‌బీఐ
బ్యాంకు నుంచే వచ్చే కాల్స్‌కు సంబంధించి ప్రామాణికతను ధృవీకరించే ప్రజా సలహాను జారీ చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: సైబర్ మోసాల నుంచి సామాన్యులను కాపాడేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కీలక చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో తమ బ్యాంకు నుంచే వచ్చే కాల్స్‌కు సంబంధించి ప్రామాణికతను ధృవీకరించే ప్రజా సలహాను జారీ చేసింది. ఇకపై బ్యాంకు సంబంధిత లావాదేవీలు, సేవల కోసం +91-1600తో మొదలయ్యే నంబర్ల నుంచి మాత్రమే కాల్స్ చేస్తామని తెలిపింది. అలాగే, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఊపందుకుంటున్న ఈ సమయంలో వినియోగదారులు సైబర్ మోసాల బారిన పడకండా ఉండేందుకు ఏయే నంబర్ల నుంచి కాల్స్ వస్తుందనే విషయంపై వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కస్టమర్లకు చేసే కాల్స్ 1600 సిరీస్‌తో ప్రారంభమయ్యే నంబర్లను ఉపయోగించాలని సూచించింది. మార్కెటింగ్ లేదా ప్రమోషనల్ కాల్స్ కోసం 1400 సిరీస్‌తో మొదలయ్యే నంబర్లను ఉపయోగించాలని వెల్లడించింది. ఈ విధానం వల్ల వినియోగదారులు చట్టబద్ధమైన కాల్స్, ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్స్ నకిలీ, సైబర్ మోసగాళ్లది కాదనే స్పష్టత ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ కూడా తన కస్టమర్ల కోసం నంబర్లను ఇచ్చింది. 1600 సిరీస్‌తో ప్రారంభమయ్యే నంబర్ నుంచి కాల్స్, మెసేజ్ వస్తే అది చట్టబద్ధమైన, అధికారిక ఎస్‌బీఐదేనని పేర్కొంది. ఇతర నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి కాల్స్ అయినా సరే మోసపూరితమనే విషయాన్ని గుర్తించుకోవాలని ఎస్‌బీఐ వెల్లడించింది.






