Anil Ambani: రిలయన్స్ కమ్యూనికేషన్స్ లోక్ అకౌంట్లను ఫ్రాడ్‌గా ప్రకటించిన ఎస్‌బీఐ

by S Gopi |

రుణ ఖాతాలను 'ఫ్రాడ్'గా వర్గీకరిస్తూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది.

Anil Ambani: రిలయన్స్ కమ్యూనికేషన్స్ లోక్ అకౌంట్లను ఫ్రాడ్‌గా ప్రకటించిన ఎస్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఏళ్లుగా అప్పుల్లో కూరుకుపోయి కష్టాల్లో ఉన్న అనిల్ అంబానీకి ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం ఎస్‌భీఐ షాక్ ఇచ్చింది. ఏళ్లుగా సమస్యలను ఎదుర్కొంటూ ఇటీవలే అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ పవర్ కంపెనీలు గాడిన పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎస్‌బీఐ రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) రుణ ఖాతాలను 'ఫ్రాడ్'గా వర్గీకరిస్తూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. గత నెలాఖరున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన లేఖలో ఆర్‌కామ్ లోన్ అకౌంట్లను 'ఫ్రాడ్'గా వర్గీకరించిందని కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీకి సంబంధించి రిజల్యూషన్ ప్రక్రియకు కంపెనీ క్రెడిటర్ల కమిటీ ఆమోదం తెలిపింది. ఇప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్ లోన్ అకౌంట్లను మోసపూరితమైనవిగా వర్గీకరించడమే కాకుండా కంపెనీ మాజీ డైరెక్టర్ అయిన అనిల్ అంబానీ పేరును భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కు రిపోర్ట్ చేయనున్నట్టు ఎస్‌బీఐ తన లేఖలో పేర్కొంది. కాగా, గతేడాది నవంబర్‌లో మరో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు కూడా ఆర్‌కామ్ లోన్ అకౌంట్లను మోసపూరితమైనవని ప్రకటించింది. కంపెనీ తమ బ్యాంకు నుంచి తీసుకున్న రూ. వెయ్యి కోట్లకు పైగా రుణాలను దుర్వినియోగం చేసిందని కెనరా బ్యాంకు ఆరోపణలు చేసింది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు నిలిపేసింది. దీనిపై స్పందించిన అనిల్ అంబానీ, 2019, జూన్ నుంచి దివాలా పరిష్కార ప్రక్రియ కింద కంపెనీ ఆస్తులు ఉన్నాయని, ఈ సమయంలో రుణాలిచ్చిన సంస్థలు, వ్యక్తులు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కుదరదని పేర్కొన్నారు.

Next Story