భారత్-ఇజ్రాయెల్ వాణిజ్యం ఇకపై రూపాయిల్లోనే.. ఎస్‌బీఐ కీలక ముందడుగు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-05 08:30:42  IST  )

భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్-ఇజ్రాయెల్ వాణిజ్యం ఇకపై రూపాయిల్లోనే.. ఎస్‌బీఐ కీలక ముందడుగు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌లో శాఖ కలిగిన ఏకైక భారతీయ బ్యాంకు అయిన ఎస్‌బీఐ, ఇకపై ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య లావాదేవీలను (Commercial transactions) భారతీయ రూపాయిల్లో (Indian Rupee) నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు జోరందుకున్న తరుణంలో ఈ నిర్ణయం వాణిజ్య రంగానికి ఊతమివ్వనుంది.

అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగాన్ని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఎస్‌బీఐ ఇజ్రాయెల్ సీఈవో వి. మణివన్నన్ తెలిపారు. ఈ కొత్త విధానం ద్వారా ఇజ్రాయెల్ కంపెనీలు ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన చెల్లింపులను నేరుగా రూపాయిల్లోనే జరపవచ్చు. దీనికోసం 'స్పెషల్ రూపాయి వోస్ట్రో అకౌంట్' (SRVA) విధానాన్ని వినియోగించనున్నట్లు, తద్వారా ఇజ్రాయెల్ విక్రేతలు, కొనుగోలుదారులు సులభంగా లావాదేవీలు జరపవచ్చని ఆయన స్పష్టం చేశారు.

Read More..

వెనిజులా చమురు పరిశ్రమ పై ట్రంప్ వ్యూహం.. జాన్ సిటిలైడ్స్ సంచలన వ్యాఖ్యలు

Next Story