- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI: లోన్ రికవరీ కోసం కొత్తగా 4,000 నియామకాలు
గత కొన్నేళ్లుగా ఎస్‌బీఐ బ్యాడ్ లోన్స్(ఎన్‌పీఏలు) తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం బ్యాంకు నికరంగా 0.39 శాతం తక్కువ ఎన్‌పీఏను కలిగి ఉంది. ఇది గడిచిన 20 ఏళ్లలోనే కనిష్ట స్థాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ రుణాల వసూళ్లను మరింత బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాదిలో 3,000 నుంచి 4,000 మంది వరకు ఉద్యోగులను ప్రత్యేకంగా లోన్ రికవరీ విభాగంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు ఎస్‌బీఐ ఛైర్మన్ సీ ఎస్ శెట్టి చెప్పారు. ఈ సిబ్బంది ప్రధానంగా ఫీల్డ్‌లో పనిచేస్తూ, చెల్లించడంలో ఆలస్యం చేసే రుణాలపై పనిచేస్తారు. గత కొన్నేళ్లుగా ఎస్‌బీఐ బ్యాడ్ లోన్స్(ఎన్‌పీఏలు) తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం బ్యాంకు నికరంగా 0.39 శాతం తక్కువ ఎన్‌పీఏను కలిగి ఉంది. ఇది గడిచిన 20 ఏళ్లలోనే కనిష్ట స్థాయి. లోన్స్ ఇవ్వడం కఠిన నిబంధనలు, రిస్క్‌ను ముందుగానే గుర్తించడం ద్వారా ఇది సాధ్యమైందని సీ ఎస్ శెట్టి తెలిపారు. ఆర్‌బీఐ కొత్తగా తెచ్చే నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో సమస్యాత్మకంగా మారే లోన్స్‌పై అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాం. అందుకే లోన్ రికవరీ కోసం కొత్త సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.






