- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI: ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె హెచ్చరిక
ఈ సమ్మెకు ప్రధానంగా తగినంత సిబ్బంది నియామకంతో సహా పలు డిమాండ్లను నెరవేర్చకపోవడమేనని యూనియన్ పేర్కొంది

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ఉద్యోగులు మే 25 నుంచి రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ (ఏఐఎస్‌బీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ సమ్మెకు ప్రధానంగా తగినంత సిబ్బంది నియామకంతో సహా పలు డిమాండ్లను నెరవేర్చకపోవడమేనని యూనియన్ పేర్కొంది. మెసెంజర్లు(సబార్డినేట్ స్టాఫ్), సెక్యూరిటీ స్టాఫ్ నియామకం, ఎన్‌పీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్ మేనేజర్ మార్చుకునే అవకాశం వంటి పలు డిమాండ్లను కూడా యాజమాన్యం ముందుంచింది. ఇక శాశ్వత ఉద్యోగాలను అవుట్‌సోర్సింగ్ చేయడాన్ని కూడా యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విధానం వల్ల డేటా లీకులు, మోసాలు, ఐడెంటిటీ చోరీ ప్రమాదం పెరుగుతోందని, ఇది కస్టమర్ల నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఏఐఎస్‌బీఐఎస్ఎఫ్ ఆరోపించింది. సమ్మె తేదీలకు ముందు నాలుగో శనివారం, ఆదివారం సెలవులు కావడం, అనంతరం మే 27న బక్రీద్ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉండటంతో, మొత్తం ఐదు రోజుల పాటు ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు పనిచేయకపోవచ్చు. అయితే, ఈ సమస్యల పరిష్కారానికి మే 23న యూనియన్, యాజమాన్యంతో సమావేశం నిర్వహించనున్నారు. చర్చలు ఫలించకపోతే సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు పేర్కొన్నారు.






