- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI: ‘అఫర్డబుల్ హౌసింగ్’ నిర్వచనాన్ని మార్చాలి: ఎస్‌బీఐ ఛైర్మన్
మెట్రో నగరాలు, పెద్ద పట్టణాల్లో ఆస్తుల ధరలు గత కొన్నేళ్లలో భారీగా పెరగడంతో, ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితులు మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు సరిపోవడం లేదని ఆయన తెలిపారు

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరల నేపథ్యంలో ‘అఫర్డబుల్ హౌసింగ్’ (సరసమైన గృహాలు) నిర్వచనాన్ని మళ్లీ సమీక్షించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలు, పెద్ద పట్టణాల్లో ఆస్తుల ధరలు గత కొన్నేళ్లలో భారీగా పెరగడంతో, ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితులు మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు సరిపోవడం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, నియంత్రణ సంస్థలను కోరారు. అఫర్డబుల్ హౌసింగ్ నిర్వచనాన్ని మారిస్తే, మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ ఇళ్లు ఈ కేటగిరీలోకి వచ్చి, పన్ను రాయితీలు లేదా తక్కువ వడ్డీ రుణాల వంటి ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుందన్నారు. కార్పెట్ ఏరియా, పెట్టుబడి పరిమితుల ఆధారంగా ఉన్న ప్రస్తుత నిర్వచనాన్ని మార్కెట్ వాస్తవాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇళ్ల ధరలు పెరగడంతో, ప్రజలు తీసుకుంటున్న హోమ్ లోన్ మొత్తం కూడా ఇప్పుడు ఎక్కువవుతోందని స్పష్టం చేశారు. గతంలో సగటు హోమ్ లోన్ పరిమాణం రూ.35-40 లక్షల మధ్య ఉండేదని, ప్రస్తుతం అది సుమారు రూ.51 లక్షలకు చేరిందని వెల్లడించారు. ఇది ఒకవైపు ఇళ్ల ధరలు పెరగడాన్ని, మరోవైపు వినియోగదారుల జీవనశైలి, గృహ అవసరాలు మారుతున్నాయనే సంకేతాలను ఇస్తోందని ఆయన వివరించారు. ఇళ్ల ధరలు, హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగినా కూడా ప్రజలు ఇళ్లు కొనడానికి ఇంకా ఆసక్తి చూపుతున్నారు. బ్యాంక్ దేశీయ గృహ రుణాల పోర్ట్‌ఫోలియో గతేడాదితో పోలిస్తే 13.66 శాతం పెరిగి రూ.8.6 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు.






