- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోన్లు తీసుకునేవారికి బిగ్ షాకిచ్చిన ఎస్‌బీఐ.. వడ్డీరేటు పెంపు
లోన్లు తీసుకునేవారికి ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజమైన ఎస్బీఐ (SBI) షాకిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: లోన్లు తీసుకునేవారికి ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజమైన ఎస్బీఐ (SBI) షాకిచ్చింది. హోమ్ లోన్స్ (SBI home loans interest) పై వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్తగా హోమ్ లోన్లు తీసుకునేవారికి ఈ లోన్ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. ఆగస్టు 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయని పేర్కొంది.
గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు 7.50 శాతం నుంచి 8.45 శాతంగా ఉండగా.. తాజాగా పెంచిన రేట్లతో 7.50శాతం నుంచి 8.70 శాతానికి చేరింది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి హోమ్ లోన్స్ ఇకపై అధిక వడ్డీరేట్లకు అందించనుంది. అయితే.. పెంచిన వడ్డీ రేట్లు కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని, ఇప్పటికే లోన్లు తీసుకున్నవారికి వర్తించవని ఎస్బీఐ స్పష్టం చేసింది. కాగా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లను పెంచింది. గతంలో 7.35 శాతంగా ఉన్న వడ్డీరేట్లు.. ఇప్పుడు 10 బేసిస్ పాయింట్లు పెరగడంతో 7.45 శాతానికి వచ్చాయి.






