- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI Cards: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్
ఇప్పటివరకు రూ.500 లోపు బకాయిలపై ఎలాంటి లేట్ ఫీజు లేదు. ఇప్పుడు ఆ సదుపాయాన్ని కంపెనీ తగ్గించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని అతిపెద్ద క్రెడిట్ కార్డ్ సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ కార్డు తమ కార్డు యూజర్లకు షాకిచ్చింది. లేట్ పేమెంట్ ఛార్జీల నిర్మాణంలో సంస్థ కీలక మార్పులు చేసింది. మే 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు ముఖ్యంగా చిన్న మొత్తాల బకాయిలు ఉన్న వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. ఇప్పటివరకు రూ.500 లోపు బకాయిలపై ఎలాంటి లేట్ ఫీజు లేదు. ఇప్పుడు ఆ సదుపాయాన్ని కంపెనీ తగ్గించింది. కొత్త నిబంధనల ప్రకారం, రూ.100-రూ.500 మధ్య బకాయి ఉంటే ఇకపై రూ.100 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ.500-1,000 మధ్య బకాయిపై లేట్ ఛార్జీ రూ.400 నుంచి రూ.500కు పెరిగింది. అయితే రూ.1,000కు పైబడిన బకాయిలకు సంబంధించిన ఛార్జీల్లో మార్పులు చేయలేదు. అంటే ప్రభావం ప్రధానంగా చిన్న బిల్లులు చెల్లించడంలో ఆలస్యం చేసే వినియోగదారులపైనే ఎక్కువగా ఉండనుంది. అంతేకాకుండా వరుసగా రెండు బిల్లింగ్ సైకిళ్లలో ‘మినిమమ్ అమౌంట్ డ్యూ’ (ఎంఏడీ) కూడా చెల్లించకపోతే అదనంగా రూ.100 పెనాల్టీ విధించనున్నారు. ఈ ఛార్జీ బకాయి పూర్తిగా క్లియర్ చేసే వరకు ప్రతి సైకిల్‌కు వర్తించే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్‌లు పెరుగుతున్న నేపథ్యంలో చెల్లింపుల క్రమశిక్షణ పెంచడమే లక్ష్యంగా ఎస్‌బీఐ కార్డ్ ఈ చర్యలు తీసుకుంది.






