కస్టమర్లకు SBI బిగ్ అలర్ట్.. ఆ సర్వీస్ బంద్

by Muthe.Rajitha |

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నవంబర్ 30 తర్వాత mCASH సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు కస్టమర్లకు తెలియజేసింది.

కస్టమర్లకు SBI బిగ్ అలర్ట్.. ఆ సర్వీస్ బంద్
X

దిశ, వెబ్ డెస్క్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నవంబర్ 30 తర్వాత mCASH సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు కస్టమర్లకు తెలియజేసింది. బెనిఫిషియరీని రిజిస్టర్ చేయకుండా మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ద్వారా డబ్బు పంపే ఈ సౌకర్యం ఇకపై అందుబాటులో ఉండదని పేర్కొంది. దీనికి బదులుగా కస్టమర్లు యూపీఐ (UPI), ఐఎంపీఎస్ (IMPS), నెఫ్ట్ (NEFT), ఆర్టీజీఎస్ (RTGS) వంటి ప్రత్యామ్నాయ డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించుకోవాలని సూచించింది. ముఖ్యంగా 'భీమ్ ఎస్‌బీఐ పే' (BHIM SBI Pay) యూపీఐ యాప్ ద్వారా VPA, అకౌంట్ నెంబర్-IFSC లేదా QR కోడ్ ఉపయోగించి సులభంగా డబ్బు పంపవచ్చని, యూపీఐ పిన్ ఎంటర్ చేయడం ద్వారా ట్రాన్సాక్షన్ పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.

Next Story