- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Air Taxi: దేశంలోనే మొదటి ఎయిర్ ట్యాక్సీ 'శూన్య' ఆవిష్కరణ

దిశ, బిజినెస్ బ్యూరో: బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ దేశంలోనే మొదటి ఎయిర్ ట్యాక్సీని ఆవిష్కరించింది. ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో సరళా ఏవియేషన్ కంపెనీ తన ప్రోటోటైప్ ఎయిర్ ట్యాక్సీ 'శూన్య'ను ప్రదర్శించింది. 2028 నాటికి బెంగళూరులో ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. శూన్య ప్రోటోటైప్ ప్రధానంగా 20-30 కిలోమీటర్ల తక్కువ దూరం ప్రయాణించేందుకు రూపొందించారు. ఇది గంటకు 250 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ఆరుగురు ప్రయాణీకులు వెళ్లచ్చు. గరిష్టంగా 680 కిలోల బరువును ఈ ఎయిర్ ట్యాక్సీ మోస్తుందని, ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యధిక పేలోడ్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ వాహనంగా కంపెనీ వివరించింది. ఇప్పటికే ఉన్న ప్రీమియం టాక్సీ సేవలతో సమానంగా ఎయిర్‌ట్యాక్సీ ధరలకు సేవలందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. 2023, అక్టోబర్‌లో అడ్రియన్ స్మిత్, రాకేష్ గాంకర్, శివమ్ చౌహాన్ అనే ముగ్గురు సరళ ఏవియేషన్‌ను స్థాపించారు. ఈ స్టార్టప్ కంపెనీల్లో ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. బెంగళూరులో ప్రారంభించిన తర్వాత ముంబై, ఢిల్లీ, పూణె సహా ప్రధాన నగరాలకు ఎయిర్ టాక్సీ సేవలను విస్తరించనున్నట్టు కంపెనీ పేర్కొంది.