- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో ల్యాప్‌టాప్‌ల తయారీని ప్రారంభించిన శామ్‌సంగ్
కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ భారతదేశంలోని గ్రేటర్ నోయిడాలో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభించింది.

దిశ, వెబ్ డెస్క్: కొరియా కంపెనీ అయినప్పటికి శామ్‌సంగ్ (Samsung) కు భారత దేశంలో ప్రత్యేక ఆధరణ పొందింది. మొదటి నుంచి సెల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, వాషింగ్ మిషన్లో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎంతో ప్రాముఖ్యం పొందింది. అలాగే నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడే ట్యాబ్స్, ల్యాప్ ట్యాప్ లను సైతం ఎప్పటినుంచో తయారు చేస్తుంది. తాజాగా కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ భారతదేశంలో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. దీంతో భారత ప్రభుత్వ ప్రోత్సహకం అందించడంతో.. గ్రేటర్ నోయిడా (Greater Noida)లో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తి (Production of laptops)ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులోనే ఫీచర్ ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లను శామ్‌సంగ్ తయారు చేస్తోంది. దీంతో గతంలో మాదిరిగా హై మోడల్స్ ఫోన్లు, టాబ్స్, లాప్ టాప్ లకు దిగుమతి సుంకాలు తగ్గడంతో ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






