- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samsung: స్మార్ట్‌ఫోన్ ధరలపై డిస్కౌంట్లు ప్రకటించిన శాంసంగ్
గత నెలలో ధరలు పెంచిన తర్వాత ప్రత్యేక పథకం ద్వారా రాయితీలివ్వడం గమనార్హం.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై పరిమితకాల తగ్గింపులను ఆఫర్ చేస్తున్నట్టు ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. మే 3(ఆదివారం) నుంచి 27వ తేదీ వరకు డీలర్ స్పెషల్ సపోర్ట్ స్కీమ్ కింద డిస్కౌంట్లను ఇస్తున్నట్టు తెలిపింది. గత నెలలో ధరలు పెంచిన తర్వాత ప్రత్యేక పథకం ద్వారా రాయితీలివ్వడం గమనార్హం. కంపెనీ అధికారిక వివరాల ప్రకారం, శాంసంగ్ ప్రీమియం మోడల్ ఎస్26 ఆల్ట్రాపై అత్యధికంగా రూ. 9 వేల డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో ఈ మోడల్ ధర రూ. 1,30,999 నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా గెలాక్సీ ఎస్26పై రూ. 8,000 డిస్కౌంట్ లభిస్తుండగా, దీని ప్రారంభ ధర రూ. 79,999కి తగ్గింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో గెలాక్సీ ఏ57పై రూ. 7,000 తగ్గింపుతో దీని ప్రారంభ ధర రూ. 49,999కి లభిస్తుంది. గెలాక్సీ ఏ37 మోడల్‌పై తూ. 5,000 తగ్గించడం ద్వారా ఈ మోడల్ రూ. 36,999కే అందుబాటులో ఉంటుంది. ఇక, ఈ స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అదనంగా లభిస్తాయని కంపెనీ పేర్కొంది.






