- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ ఫీచర్స్‌తో సామ్ సంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా.. మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందంటే?
సామ్‌సంగ్ మోడల్స్‌లో ఎస్ సిరీస్‌కు ఎంతో క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మార్కెట్‌లో ఈ మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. ఇప్పుడు రాబోయే ఎస్ 26 అల్ట్రాకు కూడా అలాంటి డిమాండే ఉంది.

దిశ, వెబ్ డెస్క్: సామ్‌సంగ్ మోడల్స్‌లో ఎస్ సిరీస్‌కు ఎంతో క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మార్కెట్‌లో ఈ మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. ఇప్పుడు రాబోయే ఎస్ 26 అల్ట్రాకు కూడా అలాంటి డిమాండే ఉంది. ఈ ఫోన్ ఎప్పుడు విడుదలవుతుందా అని సామ్ సంగ్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌కు సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఫోన్ ధర, ఫీచర్స్, మార్కెట్‌లోకి విడుదలయ్యే తేదీ ఇలా ఎన్నో ఉన్నాయి.
ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.. సామ్‌సంగ్ గెలాక్సి ఎస్26 అల్ట్రా జనవరి 2026 నాటికి మార్కెట్ లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో 16 జీబీ ర్యామ్ వేరియంట్‌కు రూ. 1,59,990 ప్రారంభ ధరతో ఇండియన్ మార్కెట్‌లోకి రాబోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ కెమెరా గెలాక్సీ జెడ్ ఫోల్డ్7 మోడల్ మాదిరిగా ఉండబోతుంది. అంతే కాకుండా Qualcomm Snapdragon 8 Elite 2 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను రూపొందిస్తున్నారు.
కాబట్టి గత సామ్ సంగ్ ఎస్26తో పోలిస్తే సామ్‌సంగ్ గెలాక్సి ఎస్25 అల్ట్రా కంటే ఈ మొబైల్ వేగంగా పనిచేసే అవకాశం ఉంది. ఇందులో హ్యాండ్ సెట్ 60W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5500mAh బ్యాటరీని పొందవచ్చు. ఈ మొబైల్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే Samsung Galaxy S26 Ultra క్వాడ్ రేర్ కెమెరా సెటప్‌లో 200MP ISOCELL సెన్సార్‌ను 200MP సోనీ సెన్సార్‌తో భర్తీ చేస్తున్నారు. దీంతో పాటు వెనుక మరో మూడు సెన్సార్లు ఉంటాయి. 50MP అల్ట్రా వైడ్-యాంగిల్ లెన్స్, 50MP పెరిస్కోప్ లెన్స్ మరియు 12MP టెలిఫోటో షూటర్.. కాబట్టి మంచి ఫోటో మరియు వీడియో క్లారిటీని పొందవచ్చు.






