- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samsung: స్మార్ట్‌ఫోన్‌లపై పండుగ ఆఫర్‌లను ప్రకటించిన శాంసంగ్
ఆఫర్‌లో భాగంగా గెలాక్సీ మోడళ్లపై అత్యధికంగా రూ. 58 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఈ ఏడాది పండుగ సీజన్ కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో ఈ-కామర్స్ కంపెనీలు ప్రకటించిన ఫెస్టివల్ సేల్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్ తన ప్రీమియం, మిడ్-రేంజ్, బడ్జెట్ ఫోన్‌ల ధరలపై భారీ రాయితీలు ఇస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలోనే కంపెనీ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా, గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఏ55 5జీ సహా ఏ, ఎం, ఎఫ్ సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ ఇస్తున్నామని, కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ వివరించింది. ఆఫర్‌లో భాగంగా గెలాక్సీ మోడళ్లపై అత్యధికంగా రూ. 58 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.
గెలాక్సీ ఎస్-సిరీస్
ఎస్24 అల్ట్రా ప్రస్తుత ధర రూ.1,29,999 ఉంటే, ఆఫర్ కింద రూ.71,999కి, ఎస్24 ప్రస్తుత ధర రూ.74,999 ఉంటే, ఆఫర్‌లో రూ.39,999కి, ఎస్24 ఎఫ్ఈ ప్రస్తుత ధర రూ.59,999 ఉంటే, ఆఫర్ కింద రూ.29,999కి అందించనుంది.
గెలాక్సీ ఏ-సిరీస్
ఏ55 5జీ ప్రస్తుత ధర రూ.39,999 ఉంటే, ఆఫర్ కింద రూ.23,999కి, ఏ35 5జీ ప్రస్తుత ధర రూ.30,999 ఉంటే, ఆఫర్‌లో రూ.17,999కి ఇవ్వనుంది.
గెలాక్సీ ఎం-సిరీస్
ఎం36 5జీ ప్రస్తుత ధర రూ.19,999 ఉండగా, ఆఫర్ కింద రూ.13,999కి, ఎం16 5జీ ప్రస్తుత ధర రూ.13,399 ఉండగా, ఆఫర్‌లో రూ.10,499కి, ఎం06 5జీ ప్రస్తుత ధర రూ.9,999 ఉంటే ఆఫర్‌లో రూ.7,499కి లభిస్తుంది.
గెలాక్సీ ఎఫ్-సిరీస్
ఎఫ్36 5జీ ప్రస్తుత ధర రూ.19,999 ఉంటే, ఆఫర్‌లో రూ.13,999కి, ఎఫ్06 5జీ ప్రస్తుత ధర రూ.9,999 ఉంటే, ఆఫర్‌లో రూ.7,499కే కొనుగోలు చేయవచ్చు.






