- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Housing Sales: 23 శాతం తగ్గిన బడ్జెట్ ఇళ్ల అమ్మకాలు
ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య అమ్మకాలు ప్రభావితం అయ్యాయని నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బడ్జెట్ ధరల ఇళ్ల అమ్మకాలు గణనీయంగా క్షీణించాయి. కొత్త నిర్మాణాలు డిమాండ్ స్థాయిలో అందుబాటులో లేకపోవడం ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య అమ్మకాలు ప్రభావితం అయ్యాయని నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలిపింది. తాజా నివేదిక ప్రకారం, దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో రూ. 50 లక్షల్లోపు సరసమైన ఇళ్ల విక్రయాలు గతేడాది కంటే 23 శాతం తగ్గి 16,273 యూనిట్లకు పడిపోయాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత, విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. కీలక ముడిసరుకుల ఖర్చు పెరగడంతో బిల్డర్లు కూడా సరసమైన గృహాల విభాగంలో కొత్త ప్రాజెక్టులను తీసుకురావడం తగ్గించారు. డేటా ప్రకారం, రూ. 50 లక్షల నుంచి రూ. కోటి విభాగంలోని ఇళ్ల అమ్మకాలు 12 శాతం తగ్గి 23,567 యూనిట్లకు చేరాయి. రూ. 1-2 కోట్ల మధ్య ఇళ్లు 10 శాతం పెరిగి 24,657 యూనిట్లకు, రూ. 2-5 కోట్ల విభాగంలో 17 శాతం పెరిగి 16,075 యూనిట్లకు రూ. 5-10 కోట్ల విభాగంలో విక్రయాలు 3 శాతం తగ్గి 3,338 యూనిట్లకు చేరాయి. రూ. 10-20 కోట్ల విభాగంలో గృహాల అమ్మకాలు 12 శాతం పెరిగి 738 యూనిట్లకు చేరుకోగా, రూ. 20-50 కోట్ల విభాగంలో అమ్మకాలు 80 శాతం పెరిగి 165 యూనిట్లకు చేరుకున్నాయి.






