- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Salary Hike: ఈ ఏడాది 40 శాతం పెరగనున్న ప్రొఫెషనల్స్ జీతాలు
ఈ ఏడాది కార్పొరేట్ కంపెనీల్లో సగటున 6-15 శాతం మధ్య జీతాలు పెరగనున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దేశీయంగా వివిధ రంగాల్లోని ప్రొఫెషన్ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు మైఖేల్ పేజ్ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2025 ఏడాదికి సంబంధించి శాలరీ గైడ్ పేరుతో విదుదల చేసిన దీని ప్రకారం, ఈ ఏడాది కార్పొరేట్ కంపెనీల్లో సగటున 6-15 శాతం మధ్య జీతాలు పెరగనున్నాయి. అదే కొత్త స్కిల్స్, కీలకమైన లీడర్‌షిప్ స్థాయి ఉద్యోగుల జీతాలు మాత్రం 30-40 శాతం మేర పెరగనుందని నివేదిక అభిప్రాయపడింది. కొత్త స్కిల్స్, లీడర్‌షిప్ పొజిషన్‌లో ఉన్న వారికి పనితీరు, పనిచేసే సామర్థ్యం ఆధారంగా అధిక వేతన పెంపు ఉంటుందని నివేదిక వివరించింది. ప్రమోషన్ అవకాశం ఉన్న సీనియర్ ఉద్యోగులకు సైతం 20-30 శాతం మధ్య జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా గ్లోబల్ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుండటం కూడా వేతనాల పెరుగుదలకు కారణం కానున్నాయి. దాదాపు డజనుకు పైగా గ్లోబల్ ఈక్విటీ, వెంచర్ కేపిటల్, సావరిన్, రియాలిటీ, ఇన్‌ఫ్రా ఫండ్లు భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ పరిణామాలు కొత్త ఉద్యోగాలకు, ఉద్యోగుల జీతాల పెరుగుదలకు దోహదపడతాయని పేజ్ గ్రూప్ ఎండీ అంకిత్ అగర్వాల్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఫిన్‌టెక్, డేటా ప్రైవసీ సహా పలు ఉన్నతస్థాయి ఉద్యోగుల జీతాలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాల్లో ఫైనాన్స్, కంప్లయన్స్, టెక్, రిస్క్ మేనేజ్‌మెంట్ లాంటి విభాగాల్లోని ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరుగుతాయని నివేదిక వెల్లడించింది.






