Russia Spirit: 10 నెలల్లో నాలుగు రెట్లు పెరిగిన రష్యా మద్యం దిగుమతులు

by S Gopi |

ఈ ఏడాది 10 నెలల్లో భారత్‌కు రష్యా స్పిరిట్స్ ఎగుమతులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని రష్యా వ్యవసాయ శాఖ పేర్కొంది.

Russia Spirit: 10 నెలల్లో నాలుగు రెట్లు పెరిగిన రష్యా మద్యం దిగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది రష్యా నుంచి భారత్‌కు పెద్ద ఎత్తున మద్యం దిగుమతులు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి 10 నెలల్లో భారత్‌కు రష్యా స్పిరిట్స్ ఎగుమతులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని రష్యా వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఫెడరల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ డేటా పేర్కొంది. దీనివల్ల రష్యా ఎగుమతిదారులకు భారత్ ఆకర్షణీయమైన మార్కెట్‌గా మారిందని రష్యా మీడియా అభిప్రాయపడింది. రష్యాకు చెందిన ప్రముఖ ఆర్థిక, వాణిజ్య దినపత్రిక 'వెడొమోస్టి'.. రష్యా వోడ్కా, ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్ ఎగుమతిదారులకు భారత్ ఆకర్షణీయమైన మార్కెట్‌గా అభివృద్ధి చెందుతోంది. 2025, మొదటి పది నెలల కాలంలో రష్యా ఎగుమతిదారులు వోడ్కా, జిన్, విస్కీ, లిక్కర్‌లతో సహా సుమారు 520 టన్నుల స్పిరిట్‌ను భారత్‌కు రవాణా చేశారు. వీటి విలువ రూ. 8 కోట్లకు పైనే ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే పరిమాణంలో మూడు రెట్లు, నగదు పరంగా నాలుగు రెట్లు ఎక్కువని వెల్లడించింది. మొత్తం ఎగుమతుల్లో వోడ్కా అగ్రస్థానంలో ఉంది. 10 నెలల్లో దీని ఎగుమతులు విలువ సుమారు రూ. 6.82 కోట్లుగా ఉన్నాయని వేడోమోస్టి పేర్కొంది.

Next Story