Crude Oil: మరింత చౌకగా భారత్‌కు రష్యా ముడిచమురు

by S Gopi |   (  Updated:2025-09-02 12:11:37  IST  )

ఇవే ధరలు సెప్టెంబర్ ఆఖరి వారంతో పాటు అక్టోబర్ నెల సరఫరాకు కూడా వర్తిస్తుంది

Crude Oil: మరింత చౌకగా భారత్‌కు రష్యా ముడిచమురు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఓవైపు రష్యాతో చమురు వాణిజ్యాన్ని తగ్గించుకోవాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి చేస్తున్నది. అయితే అమెరికా బెదిరింపులు, విమర్శలు కొనసాగుతున్నప్పటికీ, భారతీయ చమురు కంపెనీలకు రష్యా ముడి చమురు మరింత చౌకగా లభిస్తోంది. రష్యా గ్రిడ్ నుంచి చమురు ఆఫర్ పొందిన వ్యక్తులు దీని గురించి వెల్లడిస్తూ.. ఇటీవల బ్రెంట్ చమురు కంటే 3-4 డాలర్లు తక్కువకే లభించినట్టు చెప్పారు. ఇవే ధరలు సెప్టెంబర్ ఆఖరి వారంతో పాటు అక్టోబర్ నెల సరఫరాకు కూడా వర్తిస్తుంది. గతవారం రష్యాకు చెందిన ఉరల్స్ గ్రేడ్ చమురు బ్యారెల్‌కు 2.5 డాలర్ల తక్కువకే వచ్చింది. అంతకుముందు జూలైలోనూ 1 డాలర్ డిస్కౌంట్‌తో చమురు లభించింది. మరోవైపు అమెరికా నుంచి రవాణా అయ్యే చమురు సాధారణ రేట్ల కంటే ఎక్కువగా, బ్రెంట్‌తో పోలిస్తే 3 డాలర్లు ఎక్కువగా ఉందని అనలిస్టులు చెబుతున్నారు. రష్యా ఎగుమతి చేసే చమురులో ఉరల్స్ గ్రేడ్ ముఖ్యమైనది. దీన్ని రాష్య నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు సరఫరా చేస్తారు. గత కొంతకాలంగా సముద్ర మార్గంలో ఈ చమురును భారత్ అత్యధికంగా దిగుమతి చేసుకుంది. కాగా, అమెరికా ఎంత ఒత్తిళ్లకు గురి చేసినప్పటికీ భారత్‌కు రష్యానే అతిపెద్ద చమురు సరఫరా దేశంగా కొనసాగుతోంది. జూలై నెలలో రూ. 31,775 కోట్ల విలువైన చమురును రష్యా నుంచి మనదేశం కొనుగోలు చేసింది. ఇది మనదేశ దిగుమతుల్లో 31.4 శాతం వాటాను దక్కించుకోగా, ఆ తర్వాత ఇరాక్ 17.1 శాతం, అరేబియా 16.1 శాతం, యూఏఈ 11.8 శాతం కలిగి ఉన్నాయి.

Next Story