- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crude Imports: రష్యా ముడి చమురు దిగుమతుల డేటా ఇవ్వలేం
దేశ వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలను ఉటంకిస్తూ కేంద్ర సమాచార కమిషన్ కూడా దీన్ని సమర్థించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: రష్యా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ముడి చమురు వివరాలను ఆర్టీఐ చట్టం కింద తెలియజేయడం వీలవదని పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్(పీపీఏసీ) వెల్లడించింది. చమురు దిగుమతులు వాణిజ్యపరమైన, గోప్యత కలిగిన అంశం కారణంగా సమాచార హక్కు చట్టం మినహాయింపు ఉందని పీపీఏసీ స్పష్టం చేసింది. దేశ వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలను ఉటంకిస్తూ కేంద్ర సమాచార కమిషన్ కూడా దీన్ని సమర్థించింది. 2022, జూన్ నుంచి 2025, జూన్ మధ్య రష్యా నుంచి భారత్‌కు దిగుమతి అయిన ముడి చమురు వివరాలను, అలాగే ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీ విదేశ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ సంస్థల వారీగా వివరాలను కోరుతూ ఓ పిటిషనర్ కోరారు. దీనికి బదులిస్తూ, ఈ సమాచారాన్ని ఇవ్వడం వీలవదని సెంట్రల్ పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐవో) తెలిపారు. దేశాలు, కంపెనీల వారీగా చమురు దిగుమతుల సమాచారం వాణిజ్యపరమైన అంశం. ఆ వివరాల కోసం పీపీఏసీ వెబ్‌శైట్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అంశంపై సీఐసీకి వెళ్లిన పిటిషనర్‌కు ఇంధన రంగంలో దేశానికి సంబంధించిన సమాచారం వెల్లడించడం వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడం అవుతుందని సీఐసీ అభిప్రాయపడింది. ఇతర దేశాలతో సంబంధాలను ప్రభావితం చేయవచ్చని పేర్కొంది.






