- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rupee: మరో పావలా పతనమైన రూపాయి
గతవారం ముగింపుతో పోలిస్తే ఇది 25 పైసల నష్టాన్ని నమోదు చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత కరెన్సీ రూపాయి మారకం విలువ రోజురోజుకు మరింత పతనమవుతోంది. గతవారం వరుసగా రికార్డు పతనాన్ని చూసిన తర్వాత సోమవారం రూపాయి విలువ ఇప్పటివరకు ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయి రూ. 90.80కి క్షీణించింది. ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ, అమెరికా డాలరుతో రూపాయి విలువ రూ. 90.74 వద్ద స్థిరపడింది. గతవారం ముగింపుతో పోలిస్తే ఇది 25 పైసల నష్టాన్ని నమోదు చేసింది. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటం, భారత ఈక్విటీల నుంచి విదేశీ నిధులు తరలిపోతుండటం ఇందుకు ప్రధాన కారణాలు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్‌కు భారీ డిమాండ్ ఉండటం, ప్రస్తుతం ఉన్న రిస్క్‌తో కూడిన మార్కెట్ ధోరణి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.
భారత రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది, ఇది ఆసియా కరెన్సీలలో అత్యంత బలహీన కరెన్సీగా నిలిచింది. ఊహించిన దానికంటే మెరుగైన వాణిజ్య గణాంకాలు నమోదైనప్పటికీ, రూపాయికి మద్దతు లభించలేదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పరిశోధన విశ్లేషకుడు దిలీప్ పర్మార్ అన్నారు. ఇందుకు ప్రధానంగా డిమాండ్-సరఫరా అసమతుల్యతకు కారణమని, దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్, విదేశీ నిధులు తరలిపోవడం కారణంగా రూపాయిపై ప్రతికూల ప్రభావం కొనసాగుతోందని దిలీప్ పర్మార్ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రూ. 90.95 వద్ద, బలహీనపడితే రూ. 90.50 వద్ద స్థిరపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారత్-అమెరికా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు, అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలరు ఇండెక్స్ రూ. 98.23 వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 61.25 డాలర్ల వద్ద ఉంది.






