ఆల్‌టైమ్‌ కనిష్టానికి రూపాయి.. తొలిసారి రూ.90 మార్క్ క్రాస్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-03 05:59:53  IST  )

భారత రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది.

ఆల్‌టైమ్‌ కనిష్టానికి రూపాయి.. తొలిసారి రూ.90 మార్క్ క్రాస్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ (Doller)తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారిగా రూ.90 మార్కును దాటింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల ప్రాంతంలో 90.12 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తాజా పరిణామంతో దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా దిగుమతులు, ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ (United States Federal Reserve) వడ్డీ రేట్లను పెంచడం కొనసాగించడం, పెట్టుబడిదారులు సురక్షితమైన ఆశ్రయంగా భావించే డాలర్‌లోకి తమ పెట్టుబడులను మళ్లించడం రూపాయి మారకం విలువ పడిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్థిరంగా అధికంగా ఉండడం.. భారత్ తన చమురు అవసరాల్లో ఎక్కువ మొత్తాన్ని దిగుమతి చేసుకుంటుంది, దీంతో డాలర్ల డిమాండ్ పెరిగి రూపాయి పూర్తిగా బలహీనపడింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, దేశీయ మార్కెట్లలో రిస్క్ పెరగడం వల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో ఈ పరిస్థితులు తలెత్తాయని తెలుస్తోంది.

Next Story