- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూపాయి @95: ఆల్‌టైమ్ కనిష్ఠానికి పతనమైన భారత కరెన్సీ
భారత కరెన్సీ చరిత్రలో రికార్డు పతనం నమోదైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 95 మార్కును దాటి ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది.

దిశ వెబ్‌డెస్క్: భారత కరెన్సీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రూపాయి (Rupee) విలువ భారీగా క్షీణించింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మొదటిసారిగా 95 మార్కును దాటి సరికొత్త కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఆర్‌బీఐ (RBI) తీసుకున్న కొన్ని కఠిన చర్యలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, మార్కెట్ ఒత్తిడి ముందు అవి నిలవలేకపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా రూపాయి విలువ 95.12 కు పడిపోయింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారకద్రవ్య నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, ఆ ప్రభావం స్వల్పకాలం మాత్రమే ఉంది. అమెరికా (America) ఆర్థిక విధానాలు, డాలర్ ఇండెక్స్ బలపడటం, గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ఆర్‌బీఐ చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు, ముఖ్యంగా చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు మరింత ప్రియం కానున్నాయి.
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్‌లోని ఒడిదుడుకుల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1,700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇక నిఫ్టీ (NIFTY) 500 పాయింట్లకు పైగా క్షీణించింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ రంగానికి చెందిన షేర్లు కుప్పకూలాయి.






