- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 88 వేల కోట్ల విలువైన రూ. 500 నోట్లు మిస్సింగ్..!
దేశంలో దాదాపు రూ. 88,032.5 కోట్ల విలువైన రూ.500 నోట్లు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు.

న్యూఢిల్లీ: దేశంలో దాదాపు రూ. 88,032.5 కోట్ల విలువైన రూ.500 నోట్లు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు. మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా ఆర్‌బీఐకి దరఖాస్తు చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో మూడు కరెన్సీ ప్రింటింగ్ కేంద్రాల నుంచి 8,810.65 మిలియన్ల రూ.500 నోట్లను ముద్రించారు. కానీ వీటిలో ఆర్‌బీఐకి 7,260 మిలియన్ల నోట్లు మాత్రమే తిరిగి వచ్చాయని ఆర్టీఐ నివేదిక పేర్కొంది. మిగిలిన 1,760.65 మిలియన్ల విలువైన రూ. 500 నోట్ల గురించి సమాచారం ఆర్‌బీఐ వద్ద లేదు.
2016-2017లో ప్రధానంగా దేశంలో మూడు కరెన్సీ ప్రింటింగ్ కేంద్రాల్లో బెంగళూరు కేంద్రం 5,195.65 మిలియన్ నోట్లు, దేవాస్ 1,953 మిలియన్ నోట్లు, నాసిక్‌కు 1,662 మిలియన్ నోట్లను ముద్రించింది. అయితే మొత్తం 8,810.65 మిలియన్ నోట్లలో తిరిగి 7260 మిలియన్ నోట్లు మాత్రమే ఆర్‌బీఐకి తిరిగి చేరాయి. మిగిలిన 1,760.65 మిలియన్ల నోట్లు గల్లంతయ్యాయని మనోరంజన్ రాయ్ ఆరోపిస్తున్నారు. గల్లంతైన 1760.65 మిలియన్ నోట్లలో 210 మిలియన్ నోట్లు నాసిక్ మింట్‌లో ఏప్రిల్ 2015-మార్చి 2016 మధ్య ముద్రించబడ్డాయి.






