- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: మండే బ్లడ్‌బాత్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సోమవారం మార్కెట్లు ప్రారంభమైన 10 నిమిషాల్లోనే యుద్ధ పరిస్థితులు, క్రూడ్ ధరల ప్రభావంతో సెన్సెక్స్ ఏకంగా 2,490 పాయింట్లు, నిఫ్టీ 750 పాయింట్లకు పైగా రికార్డు పతనాన్ని చూశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సోమవారం దలాల్ స్ట్రీట్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయంగా చమురు ధరలను ప్రభావితం చేయడం, ఈ అనిశ్చితి ఎంతకాలం ఉంటుందనే దానిపై ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాల కారణంగా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. దీనివల్ల కీలక బెంచ్‌మార్కె సూచీలు దాదాపు 2 శాతం మేర క్షీణించాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభమైన 10 నిమిషాల్లోనే యుద్ధ పరిస్థితులు, క్రూడ్ ధరల ప్రభావంతో సెన్సెక్స్ ఏకంగా 2,490 పాయింట్లు, నిఫ్టీ 750 పాయింట్లకు పైగా రికార్డు పతనాన్ని చూశాయి. ఈ ప్రభావం కారణంగా ఇన్వెస్టర్లు రూ. 12.4 లక్షల కోట్ల మేర నష్టాలను చూశారు. ప్రధానంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ముడి చమురు ధరల పెరుగుదలకు దారితీశాయి. ఇదే సమయంలో విదేశీ నిధులు మన మార్కెట్ల నుంచి తరలిపోవడంతో భారత కరెన్సీ రూపాయిపై తీవ్ర ఒత్తిడి కనిపించింది. మధ్యాహ్నం తర్వాత కొంత కోలుకున్నప్పటికీ, దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1352.74 పాయింట్లు కుదేలై 77,566 వద్ద, నిఫ్టీ 422.40 పాయింట్లు క్షీణించి 24,028 వద్ద ముగిశాయి. మదుపర్లు రూ. 8.6 లక్షల కోట్ల నష్టాలను ఎదుర్కోవడంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 441.1 లక్షల కోట్లకు చేరింది. బ్యాంకింగ్, ఐటీ, మెటల్ స్టాక్‌లు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. నిఫ్టీ 50లో ఎస్‌బీఐ, ఇండిగో, మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీ షేర్లు 5-7 శాతం మేర కుదేలయ్యాయి.
రూ.22 లక్షల కోట్లు నష్టం
బీఎస్ఈ డేటా ప్రకారం, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల లిస్టెడ్ కంపెనీల విలువ భారీగా క్షీణించింది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధ పరిస్థితుల కారణంగా తొమ్మిది రోజుల వ్యవధిలో మదుపర్లు రూ. 22 లక్షల కోట్ల మేర నష్టాలను ఎదుర్కొన్నారు. మార్చి 28న రూ. 463 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ మార్కెట్ క్యాప్, సోమవారం నాటికి రూ. 441.10 లక్షల కోట్లకు చేరింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. చమురు ధరలు
సోమవారం నాటి నష్టాలకు ప్రధానంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సంఘర్షణే కారణం. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ పరిణామాల వల్ల ఇంధన సరఫరాలకు అంతరాయం తప్పదనే ఆందోళనలు మదుపర్లలో పెరిగాయి. ఈ ప్రభావం మన మార్కెట్లతో పాటు గ్లోబల్ మార్కెట్లపైనా పడింది. బ్రెంట్ క్రూడ్ ధర సోమవారం 100 డాలర్లు దాటడంతో ఇన్వెస్టర్లలో భయాలు ఎక్కువయ్యాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలకు తోడు చమురుపై ఆధారపడిన మనదేశంలో మరింత ఒత్తిడి ఉంటుందనే ఆందోళనలు అమ్మకాలకు దారితీశాయి. అయితే, సోమవారం ఉదయం ఓ దశలో బ్రెంట్ క్రూడ్ ధర 125 డాలర్ల వరకు వెళ్లి, ఆ తర్వాత కోలుకుంది.
విదేశీ నిధులు వెనక్కి
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్ఐఐ) అమ్మకాలు కూడా మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి. పెరుగుతున్న అనిశ్చితి మధ్య గ్లోబల్ ఫండ్లు భారతీయ ఈక్విటీలకు దూరం చేశాయి. మన మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకెళ్తున్న ఎఫ్ఐఐలు నిధుల ఉపసంహరణను కొనసాగిస్తూనే ఉన్నారు. శుక్రవారం రూ.6,030 కోట్లకు పైగా విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించగా, సోమవారం మరో రూ. 3 వేల కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇది దేశీయ ఈక్విటీలపై మరింత ఒత్తిడిని పెంచిందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి కె విజయకుమార్ అన్నారు.
భారత రూపాయి మరింత పతనం
సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92.35 స్థాయికి పడిపోయింది. ప్రపంచ ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో పాటు మధ్యప్రాచ్యంలో తీవ్రమవుతున్న సంఘర్షణ మధ్య డాలర్ విలువ బలపడింది. ఇదే సమయంలో ఎఫ్ఐఐల అమ్మకాల కారణంగా రూపాయిపై ఒత్తిడి కనిపించింది. శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ. 91.82 వద్ద ఉండగా, సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 48 పైసలు క్షీణించి రూ. 92.30గా ఉంది.






