Stock Market: రూ. 6.50 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

by S Gopi |

ప్రధానంగా మన ఐటీ కంపెనీల షేర్లు 1 శాతానికి పైగా పడిపోయాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఇండెక్స్ 1,000కి పైగా క్షీణించింది.

Stock Market: రూ. 6.50 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చూశాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా టెక్ కంపెనీల షేర్లలో నష్టాలు కొనసాగడంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్ని బలహీన సంకేతాల కారణంగా మన స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ప్రధానంగా మన ఐటీ కంపెనీల షేర్లు 1 శాతానికి పైగా పడిపోయాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఇండెక్స్ 1,000కి పైగా క్షీణించింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద శుక్రవారం ఒక్కరోజే రూ. 6.5 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 472 లక్షల కోట్ల నుంచి రూ. 465.50 లక్షల కోట్లకు పడిపోయింది. స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం, ఐటీ రంగంలోని చాలా పనులు ఆటోమేట్ అవుతాయనే చర్చల కారణంగా ఐటీ స్టాక్‌లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి. దీనికితోడు అంతర్జాతీయంగా అమెరికా ద్రవ్యోల్బణ డేటాకు ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, ఇండియా-యూఎస్ డీల్ కారణంగా జరిగిన ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణ, రూపాయి బలహీనత వంటి అంశాలు నష్టాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1048.16 పాయింట్లు కుదేలై 82,626 వద్ద, నిఫ్టీ 336.10 పాయింట్లు నష్టపోయి 25,471 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 90.64 వద్ద ఉంది.

Next Story