- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: ఇన్వెస్టర్లకు రూ. 5 లక్షల కోట్ల నష్టం
మదుపర్ల సంపద ఒక్కరోజే రూ. 5 లక్షల కోట్లకు పైగా క్షీణించడంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 463.51 లక్షల కోట్లకు చేరింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం భారీ పతనాన్ని ఎదుర్కొన్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించి చివరి ట్రేడింగ్ సెషన్ కావడం కూడా సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున అమ్మకాలను జరపడటం, భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం వంటి అంశాల కారణంగా శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో సూచీలు కుప్పకూలాయి. ఓ దశలో సెన్సెక్స్ ఇండెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు నష్టపోయింది. దీంతో మదుపర్ల సంపద ఒక్కరోజే రూ. 5 లక్షల కోట్లకు పైగా క్షీణించడంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 463.51 లక్షల కోట్లకు చేరింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 961.42 పాయింట్లు కుదేలై 81,287 వద్దకు చేరింది. నిఫ్టీ 317.90 పాయింట్లు నష్టపోయి 25,178 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 91.06 వద్ద ఉంది. వారాంతం నష్టాలకు దేశీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు కీలక ఆటో, రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగల్లో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలను కొనసాగించడం కూడా కాణమని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ఇదే సమయంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) గురువారం రూ.3,465.99 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం కూడా మదుపర సెంటిమెంట్ బలహీనపడేందుకు కారణమైంది. అమెరికాలో ఇరాన్ అణు చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిశాయి. దీనివల్ల మధ్యప్రాచ్యంలో పరిస్థితులపై ఆందోళనలు పెరిగాయి.






