నెట్టింట వైరల్ అవుతున్న కోహ్లీ రెస్టారెంట్ మెనూ.. ఒక్క ప్లేట్ బిర్యానీ రేటెంతో తెలిస్తే షాకవ్వడం ఖాయం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-31 16:39:05  IST  )

వన్8కమ్యూన్ పేరుతో రెస్టారెంట్ బిజినెస్ ను ప్రారంభించిన కోహ్లీ.. ముంబైలోని జుహూ ప్రాంతంలో దివంగత లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్ బంగ్లాను రీమోడల్ చేసి..

నెట్టింట వైరల్ అవుతున్న కోహ్లీ రెస్టారెంట్ మెనూ.. ఒక్క ప్లేట్ బిర్యానీ రేటెంతో తెలిస్తే షాకవ్వడం ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్: విరాట్ కోహ్లీ.. అతనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల సంఖ్య ఎక్కువే. క్రికెట్ లో రాణిస్తున్న కోహ్లీ.. కొన్నెళ్ల క్రితం రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టాడు. వన్8కమ్యూన్ పేరుతో చైన్ రెస్టారెంట్ బిజినెస్ ను ప్రారంభించిన కోహ్లీ.. ముంబైలోని జుహూ ప్రాంతంలో దివంగత లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్ బంగ్లాను రీమోడల్ చేసి, అక్కడ ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశాడు. విభిన్నమైన వంటకాలతో అదరగొడుతున్న ఈ రెస్టారెంట్ లో ధరలు మాత్రం ఎక్కువేనన్న టాక్ ఉంది. తాజాగా ఆ మెనూ నెట్టింట వైరల్ గా మారగా.. ఒక ప్లేట్ బిర్యానీ రేటు చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.

రోడ్డు పక్కన అమ్మే దుకాణాల్లో ప్లేట్ చికెన్ బిర్యానీ రూ.100 నుంచి రూ.150 వరకు లభిస్తుంది. అలాగే ఒక చపాతీ లేదా రోటీ రూ.20 కు వస్తుంది. అదే రెస్టారెంట్లో అయితే బిర్యానీ రూ.300- రూ.400, చపాతీ లేదా తందూరీ రూ.40 నుంచి రూ.60 వరకూ ఉంటుంది. కానీ కోహ్లీ రెస్టారెంట్లో మాత్రం.. తందూరీ రోటీ లేదా బేబీ నాన్ ధర రూ.118, సాల్టెడ్ ఫ్రైస్ ధర రూ.348, లక్నో దమ్ ల్యాంబ్ బిర్యానీ ధర రూ. 978, చికెన్ చెట్టినాడ్ బిర్యానీ ధర రూ. 878, ఒక ప్లేట్ ప్లెయిన్ రైస్ ధర రూ.318 గా ఉంది. ఇక ఈ రెస్టారెంట్లో అత్యంత ఖరీదైన వంటకం నాన్ వెజ్ ల్యాంబ్ షాంక్. దీని రేటు రూ.2318, డెజర్ట్స్ విషయానికొస్తే.. మస్కార్పోన్ చీజ్ కేక్ రూ.748, కింగ్ కోహ్లీ స్పెషల్ చాక్లెట్ మౌస్ రూ.818, సిగ్నేచర్ సిజ్లింగ్ క్రోసెంట్ ధర రూ.918గా ఉన్నాయి. ఈ రెస్టారెంట్ కు సంబంధించిన మెనూ జొమాటోలో అందుబాటులో ఉంది.

Next Story