- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Kumbh Mela: మహా కుంభమేళాకు రూ. 2 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం
ప్రపంచంలోనే మానవాళి హాజరయ్యే అతిపెద్ద ఉత్సవ కుంభమేళాకు అమెరికా, రష్యా జనాభా కంటే ఎక్కువ మంది ప్రజలు వస్తారని అంచనా

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం మహా కుంభమేళా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రదేశమైన సంగం వద్ద 50 లక్షల మందికి పైగా ప్రజలు మొదటిరోజు పవిత్ర స్నానం చేశారు. ప్రపంచంలోనే మానవాళి హాజరయ్యే అతిపెద్ద ఉత్సవంతా పేరున్న ఈ కుంభమేళాకు అమెరికా, రష్యా జనాభా కంటే ఎక్కువగా 40 కోట్ల మందికి పైగా ప్రజలు వస్తారని అంచనా. 45 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ సమయంలో రూ. 2 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని అంచనాలున్నాయి. ఈ సమయంలో వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాల ద్వారా సగటున ఒక వ్యక్తి రూ. 5,000 ఖర్చు చేస్తారని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. ఈ ఖర్చులు ప్రధాన హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, తాత్కాలిక నివాసం, ఆహారం, హెల్త్‌కేర్ ఇంకా ఇతర సేవలు కలిపి ఉంటాయని ఆయన తెలిపారు.
స్థానిక హోటళ్లు, తాత్కాలిక లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌ల ద్వారా రూ. 40,000 కోట్ల ఆదాయం రావొచ్చని, భోజనాలు, ప్యాకేజ్‌డ్ ఫుడ్, నీటి సౌకర్యాలు, బిస్కెట్లు, జ్యూస్‌లు వంటి వ్యాపారాల నుంచే రూ. 20 కోట్లు, గంగా నీరు, దేవతా విగ్రహాలు, నూనె, దీపాలు, ధూప సామగ్రి, అధ్యాత్మిక పుస్తాల ద్వారా మరో రూ. 20,000 కోట్ల విలువ లావాదేవీలు జరగనున్నాయని ఆయన వివరించారు. స్థానిక, అంతర్రాష్ట్ర సేవలు, సరుకు రవాణా, టాక్సీలు సహా రవాణా, లాజిస్టిక్స్ వ్యాపారం రూ. 10,000 కోట్లు, టూరిజం సేవలు, టూర్ గైడ్‌లు, ట్రావెల్ ప్యాకేజీలు, సంబంధిత కార్యకలాపాల్లో మరో రూ. 10,000 కోట్ల వ్యాపారం జరగనుందని సీఏఐటీ పేర్కొంది. మెడికల్ క్యాంపులు, ఇతర ఆరోగ్య సంబంధిత ఔషధ వ్యాపారం రూ. 3,000 కోట్లు, ఇ-టికెటింగ్, డిజిటల్ చెల్లింపులు, వై-ఫై సేవలు, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్‌ల రూ. 1,000 కోట్ల వ్యాపారాన్ని చూసే అవకాశం ఉంది. ప్రకటనలు, ప్రచార కార్యకలాపాలతో సహా వినోదం, మీడియా ద్వారా రూ. 10,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.






