- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: ఆర్‌బీఐకి తిరిగొచ్చిన 98.26 శాతం రూ. 2 వేల నోట్లు
ఈ ఏడాది మే 31 నాటికి చలామణిలోని 98.26 శాతం పెద్ద నోట్లు తిరిగొచ్చాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: సమాజంలో చలామణి అవుతున్న రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుని రెండేళ్లు దాటినప్పటికీ ఇంకా రూ. 6,181 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు వెనక్కి రావాల్సి ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు సోమవారం గణాంకాలను విడుదల చేసింది. దాని ప్రకారం, ఈ ఏడాది మే 31 నాటికి చలామణిలోని 98.26 శాతం పెద్ద నోట్లు తిరిగొచ్చాయి. 2023, మే 19న రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడే సమయానికి మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. ఈ నోట్లను ఆర్‌బీఐ చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ఎవరి వద్దనైనా ఆ నోట్లు ఉంటే ఆర్‌బీఐ కార్యాలయాల్లో డిపాజిట్ లేదా మార్చుకోవచ్చు. 2023, అక్టోబర్ 9వ తేదీ నుంచి ఆయా నోట్లను వ్యక్తులు, సంస్థలు ఆర్‌బీఐ ఆఫీసుల్లో అందజేస్తే, ఆ మొత్తాన్ని వారి అకౌంట్లలో డిపాజిట్ చేసే అవకాశం కల్పించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల నుంచి కూడా ప్రజలు తమ వద్ద రూ. 2,000 నోట్లను ఆర్‌బీఐకి పోస్టల్ రూపంలో పంపి, తమ అకౌంట్లలో క్రెడిట్ చేయించుకొనే వీలు కల్పించింది.






