IndiGo: విమానాల రద్దుతో ఇండిగోకు రూ. 1,800 కోట్ల నష్టం

by S Gopi |

డిసెంబర్ 9 వరకు టిక్కెట్ల రద్దు కారణంగా ఎయిర్‌లైన్‌కు ఇప్పటికే వచ్చిన తక్షణ నష్టం రూ. 900 కోట్లకు పైగా ఉంది

IndiGo: విమానాల రద్దుతో ఇండిగోకు రూ. 1,800 కోట్ల నష్టం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల రోజుకు వందల విమానాలను రద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని ఫలితంగా కంపెనీ మూడో త్రైమాసికానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్‌లో భారీ ఆర్థిక నష్టాన్ను ఎదుర్కోనుంది. ఇప్పటికే విమానాల రద్దు వల్ల ఇండిగోకు రూ. 1,800 కోట్ల నష్టం వాటిల్లింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. డిసెంబర్ 9 వరకు టిక్కెట్ల రద్దు కారణంగా ఎయిర్‌లైన్‌కు ఇప్పటికే వచ్చిన తక్షణ నష్టం రూ. 900 కోట్లకు పైగా ఉంది. ఇది టిక్కెట్ల రద్దు కారణంగా ప్రయాణికులకు తిరిగి చెల్లించింది. అయితే, విమానాల ఆలస్యం కారణంగా రద్దు చేయాల్సిన టిక్కెట్లకు పరిహారం చెల్లించాల్సి వస్తే ఈ ఆర్థిక భారం మరింత పెరుగుతుంది.

ఎయిర్‌లైన్ తాజా వివరాల ప్రకారం, డిసెంబర్ 1-9 తేదీల మధ్య కాలానికి కంపెనీ 8.86 లక్షల పీఎన్ఆర్‌లను రద్దు చేసింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రయాణీకుల చార్టర్ ప్రకారం, 2 గంటల కంటే ఎక్కువసేపు ప్రయాణించే విమానాన్ని రద్దు చేసి, 24 గంటల ముందు ప్రయాణీకుడికి సమాచారం ఇవ్వకపోతే ఎయిర్‌లైన్ రూ. 10,000 లేదా ప్రాథమిక ఛార్జీతో పాటు ఎయిర్‌లైన్ ఇంధన ఛార్జీ - ఏది తక్కువైతే అది పరిహారంగా చెల్లించాలి. చార్టర్ ప్రకారం, ఇండిగో ఇప్పటికే డిసెంబర్ 9 వరకు రూ. 886 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. కాబట్టి, ఇండిగో చెల్లించాలని ఆదేశాలు జారీ అయితే వాపసు, పరిహారం విలువ దాదాపు రూ. 1,800 కోట్లు అవనుంది. అయితే, తక్కువ విమాన సమయానికి పరిహారం తక్కువగా ఉండటం వల్ల వాస్తవంలో చెల్లింపు మొత్తంలో వ్యత్యాసం ఉండవచ్చు.

Next Story