FPIs: 4 నెలల్లో రూ. 1.68 లక్షల కోట్లు వెనక్కి

by S Gopi |

ఇది ఇప్పటివరకు చారిత్రాత్మక గరిష్టమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.

FPIs: 4 నెలల్లో రూ. 1.68 లక్షల కోట్లు వెనక్కి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో విదేశీ నిధులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) 2026లో ఇప్పటివరకు ఏకంగా రూ. 1.68 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఇప్పటివరకు చారిత్రాత్మక గరిష్టమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు ధరలు, గ్లోబల్ రిస్క్ పెరగడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ మొత్తం నిధుల్లో అత్యధిక భాగం మార్చి నెలలోనే నమోదైంది. గత నెలలో ఎఫ్‌పీఐలు రూ. 1.1 లక్షల కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించారు. యూరోపియన్ యూనియన్‌తో భారత వాణిజ్య చర్చలు, భారతీయ వస్తువులపై సుంకాలను సడలించాలన్న అమెరికా నిర్ణయంతో ఫిబ్రవరిలో నిధుల ఉపసంహరణ కొంత తగ్గింది. కానీ, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను తిరిగి రిస్క్-ఆఫ్ మోడ్‌లోకి నెట్టేశాయి.

Next Story