బుల్లెట్ బైక్ కొనుగోలు చేసే వారికి శుభవార్త..రూ.1.56 లక్షలకు దిగిరానున్న ధర !

by velandi.Saikiran |

ఈ నెల 22వ తేదీ నుంచి 350 సీసీ కెపాసిటీ ఉన్న మోడల్ బైక్స్.. ధరలు దాదాపు 22 వేల రూపాయలు తగ్గబోతున్నాయి. రాయల్ ఎన్ ఫీ

బుల్లెట్ బైక్ కొనుగోలు చేసే వారికి శుభవార్త..రూ.1.56 లక్షలకు దిగిరానున్న ధర !
X

దిశ‌, వెబ్ డెస్క్ : మార్కెట్ లో బుల్లెట్ బైక్స్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ బైక్స్ నడిపేందుకు ఎక్కువ శాతం యూత్ ఆసక్తి చూపిస్తారు. మధ్య వయస్సు ఉన్న వ్యక్తులు కూడా ఈ బైక్ నడిపేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఖర్చు ఎంతైనా సరే అని ఈ బైక్స్ కొనుగోలు చేస్తున్నారు. బుల్లెట్ బైక్ ఉంటే... ఓ రేంజ్ అన్న తరహాలో ఆలోచన చేస్తున్నారు.

దీనికి తగ్గట్టుగానే రాయల్ ఎన్ ఫీల్డ్ ( Royal Enfield ) బైక్స్ ధరలు ఆకాశాన్ని ఉంటాయి. ఈ బైక్స్ కొనుగోలు చేయాలంటే కచ్చితంగా రెండు లక్షలు చేతిలో ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఆ సమస్య ఉండదు. జీఎస్టీ లో పలు మార్పులు జరిగిన... నేపథ్యంలో... బుల్లెట్ బైక్ ధరలు దిగి వచ్చాయి. ఈ మేరకు రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ కూడా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 350 సీసీ కెపాసిటీ ఉన్న మోడల్ బైక్స్.. ధరలు దాదాపు 22 వేల రూపాయలు తగ్గబోతున్నాయి.

రాయల్ ఎన్ ఫీల్డ్ 350 బేస్ మోడల్ ఎక్స్ షోరూం ప్రైజ్ వచ్చేసి 1.56 లక్షలు గా ఉంది. ఇక క్లాసిక్ ( Royal Enfield classic) 350 ధర 22వేల రూపాయలు తగ్గి....1.77 లక్షలు గా ఫిక్స్ చేశారు. హంటర్ 350 ధర కనిష్టంగా 1.27 లక్షలు గా తగ్గనుంది. అయితే 350 సిసి కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బైక్స్ ధరలు భారీగా పెరగనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అవి లగ్జరీ ఐటమ్స్ కింద పరిగణలోకి తీసుకుంటోంది కేంద్రం. అందుకే ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్లిక్

Next Story