- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 లాంచ్
కానన్ బ్లాక్, బ్యాటిల్‌షిప్ బ్లూ అనే రెండు రంగుల్లో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్, క్లాసిక్ బుల్లెట్ డిజైన్‌ను కొనసాగిస్తూ ఆధునిక ఫీచర్లను తెచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టూ-వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్లోకి తన అత్యంత శక్తివంతమైన ‘బుల్లెట్ 650’ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. రూ. 3.64 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో తీసుకొచ్చిన ఈ బైక్, కంపెనీకి చెందిన 650సీసీ ప్లాట్‌ఫామ్‌లో బుల్లెట్ బ్రాండ్‌కు కొత్త అధ్యాయంగా భావిస్తున్నారు. కానన్ బ్లాక్, బ్యాటిల్‌షిప్ బ్లూ అనే రెండు రంగుల్లో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్, క్లాసిక్ బుల్లెట్ డిజైన్‌ను కొనసాగిస్తూ ఆధునిక ఫీచర్లను తెచ్చింది. 19-అంగుళాల ఫ్రంట్ వీల్, 18-అంగుళాల రేర్ వీల్, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, చేతితో వేసిన గోల్డ్ పిన్‌స్ట్రైప్స్, బెంచ్ సీటు వంటి ఎలిమెంట్స్ బుల్లెట్‌కు ఉన్న సంప్రదాయ గుర్తింపును కంపెనీ కొనసాగించింది. బుల్లెట్ 650లో ప్యారలల్ ట్విన్ 650సీసీ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్, షోవా సస్పెన్షన్ వంటి ప్రీమియం మెకానికల్ సెటప్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ అందించింది. సిటీ రైడర్లతో పాటు లాంగ్ టూరింగ్‌కు కూడా అనుకూలంగా ఉండేలా దీన్ని రూపొందించారు. డిజిటల్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, గేర్ పొజిషన్ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్లు, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, 'టైగర్ ఐ' పైలట్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అదనంగా పీషూటర్ ఎగ్జాస్ట్, రెట్రో స్టైల్ స్విచ్‌గేర్, కస్టమైజేషన్ యాక్సెసరీస్ ద్వారా రైడర్లు తమ అవసరాలకు అనుగుణంగా బైక్‌ను మార్చుకునే అవకాశం ఉంటుందని ఐషర్ మోటార్స్ సీఈఓ బి గోవిందరాజన్ తెలిపారు.






