Royal Enfield: మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

by S Gopi |

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కంపెనీ ఉపయోగించిన తేలికపాటి బైక్‌ ప్రేరణతో దీన్ని డిజైన్ చేసింది.

Royal Enfield: మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రీమియం మోటార్‌సైకిళ్ల సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టింది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరుతో కంపెనీ తన మొట్టమొదటి ఈవీ బైక్‌ను గురువారం మార్కెట్లో విడుదల చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కంపెనీ ఉపయోగించిన తేలికపాటి బైక్‌ ప్రేరణతో దీన్ని డిజైన్ చేసింది. స్మార్ట్ బ్లాక్, ఫ్లీ గ్రీన్ రంగుల్లో లభించే ఈ బైక్ ధరను రూ. 2.79 లక్షలుగా నిర్ణయించినట్టు రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. బ్యాటరీ యాజ్-ఏ-సర్వీస్(బాస్) పద్దతిలో కొనుగోలు చేసేందుకు రూ. 1.99 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. ఏప్రిల్ 10 నుంచి బుకింగ్, టెస్ట్ రైడ్ సదుపాయం ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మే నెల నుంచి డెలివరీ ప్రారంభం కానున్నాయి. ఈ బైక్‌లో 3.91 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీతో పాటు పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అమర్చారు. ఒక్కసారి ఫుల్‌ఛార్జ్ చేసి, 154 కి.మీ. ప్రయాణించవచ్చు. గరిష్టంగా గంటకు 115 కి.మీ. వేగం అందుకునే ఈ బైక్‌ను 2.16 గంటల్లో 100 శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. దీని బరువు కేవలం 125 కిలోలు ఉండటం గమనార్హం.

Next Story