- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Royal Enfield: బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు
దీనికోసం బీజీఎంఐ మాతృసంస్థ క్రాఫ్టన్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు మంగళవారం ప్రకటనలో వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఆదరణ కలిగిన ప్రముఖ మల్టీ ప్లేయర్ షూటింగ్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ)లో ఇకపై రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు కనిపించనున్నాయి. దీనికోసం బీజీఎంఐ మాతృసంస్థ క్రాఫ్టన్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. బీజీఎంఐ గేమ్‌లో కంపెనీకి చెందిన బుల్లెట్ 350, కాంటినెంటల్ జీటీ650 మోటార్‌సైకిళ్లు రైడబుల్ బైక్‌లుగా ఉంటాయి. ఇది జనవరి 15న వచ్చే బీజీఎంఐ 4.2 అప్‌డేట్‌లో భాగంగా రెండు మోటార్‌సైకిళ్లు జనవరి 19, 2026 నుంచి గేమ్‌లోకి వస్తాయి. బీజీఎంఐతో భాగస్వామ్యం కేవలం ఉనికిని విస్తరించడం కంటే ఎక్కువని రాయల్ ఎన్‌ఫీల్డ్ హెడ్ కస్టమ్, మోటార్‌స్పోర్ట్స్ అడ్రియన్ జాన్ సెల్లర్స్ అన్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్లోబల్ ఆటోమోటివ్ రంగంలో ఐకానిక్ బ్రాండ్. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ విభాగానికి సంబంధించి గేమింగ్‌లో ఈ భాగస్వామ్యం కీలకమని క్రాఫ్టన్ ఇండియా బిజినెస్ డెవలప్‌మెంట్, పార్టనర్‌షిప్స్ హెడ్ సెద్ధార్థ్ మెరోత్రా అన్నారు.






