- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rolls-Royce: భారత్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్న రోల్స్ రాయిస్
భారత్ సొంతంగా అభివృద్ధి చేయడానికి వీలుగా సాంకేతికత, డిజైన్లను కూడా పంచుకోవాలని భావిస్తున్నట్టు శశి ముకుందన్ వివరించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బ్రిటిష్ ఏరో-ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్ భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. ముఖ్యంగా జెట్ ఇంజన్లు, నావల్ ప్రొపల్షన్, ల్యాండ్ సిస్టమ్స్, అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్‌తో సహా వివిధ విభాగాల్లో అవకాశాలను అందుకోవాలని, పూర్తి సామర్థ్యాన్ని పెట్టుడుల విస్తరణ ప్రణాళికకు అనుగుణంగా యూకే వెలుపల భారత్‌ను అతిపెద్ద కేంద్రంగా ఎంచుకోవాలని చూస్తున్నట్టు రోల్స్ రాయిస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శశి ముకుందన్ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కంపెనీ దేశంలో భారీ పెట్టుబడి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రోగ్రామ్ కింద భారత ప్రభుత్వానికి కంబాట్ జెట్‌లను అందించడానికి కొత్త జనరేషన్ ఏరో ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ కొత్త తరహ యుద్ధ విమానాల కోసం ఇంజిన్లపై పని చేయడానికి రోల్స్ రాయిస్ భారతీయ రక్షణ డిజైనర్లతో మాట్లాడుతోంది. భారత్ సొంతంగా అభివృద్ధి చేయడానికి వీలుగా సాంకేతికత, డిజైన్లను కూడా పంచుకోవాలని భావిస్తున్నట్టు శశి ముకుందన్ వివరించారు.
యుద్ధనౌకలు, జలాంతర్గాములలో ఉపయోగించే ఇంజిన్లు అయిన నావల్ ప్రొపల్షన్ సిస్టమ్‌లపై కూడా రోల్స్ రాయిస్ పని చేయాలనుకుంటోంది. ఈ వ్యవస్థలు నౌకలు వేగంగా, మరింత సమర్థవంతంగా కదలడానికి సహాయపడతాయి. ఈ రకమైన సాంకేతికతను కలిగి ఉన్న ప్రపంచంలోని కొన్ని కంపెనీలలో రోల్స్ రాయిస్ ఒకటి. కొత్త పెట్టుబడుల ద్వారా భారత్ మరిన్ని వస్తువులను తయారు చేయడంలో సహాయపడుతుంది, ఉపాధి కల్పిస్తుంది, రక్షణ పరిశ్రమను బలోపేతం చేస్తుంది. అన్నీ సానుకూలంగా జరిగితే, రోల్స్ రాయిస్ భారత్‌ను యూకే, యూఎస్, జర్మనీ లాగా ప్రధాన మార్కెట్లలో ఒకటిగా మార్చుకోవాలని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.






