GTA 6: వీడియో గేమ్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఆ వీడియో కోసం మరో ఏడాది ఆగాల్సిందే..!

by Vennela |

GTA 6: గేమింగ్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్న గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 పై ఎట్టకేలకు కంపెనీ ఓ కీలక అప్ డేట్ ఇచ్చింది.

GTA 6: వీడియో గేమ్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఆ వీడియో కోసం మరో ఏడాది ఆగాల్సిందే..!
X

దిశ, వెబ్ డెస్క్: GTA 6: గేమింగ్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్న గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 పై ఎట్టకేలకు కంపెనీ ఓ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ గేమ్ విడుదల కోసం అభిమానులు మరో ఏడాది పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ మేరకు GTA 6ను మే 26, 2026న లాంచ్ చేయనున్నట్లు ఈ గేమ్ డెవలపర్ కంపెనీ రాక్ స్టార్ గేమ్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ గేమ్ ను సెప్టెంబర్ 2025 లో విడుదల చేయాలని మొదట షెడ్యూల్ చేశారు. అయితే ఇప్పుడు దీన్ని మరింత అప్ డేట్ చేసేందుకు డెవలపర్లు అదనపు సమయం కోరినట్లు కంపెనీ తెలిపింది.

ఈ GTA 6 గేమ్ ను 2023లో ప్రకటించారు. అయితే ఇది 2025లో లాంఛ్ అవుతుందని చెప్పారు. ఈ టైమ్ లైన్ ను రాక్ స్టార్ మాత్రుసంస్థ టేక్ టు ఇంటరాక్టివ్ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ ను మార్చుతున్నట్లు రాక్ స్టార్ గేమ్స్ మే 2న అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రకటనలో గేమ్ ను హై క్వాలిటీతో ప్రదర్శించాలనుకుంటున్నట్లుగా కంపెనీ పేర్కొంది. ఈ అదనపు సమయం దీనికి తుది మెరుగులు దిద్దడానికి సహాయపడుతుందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే అభిమానుల సహనం, సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది.

అయితే డిసెంబర్ 2023లో విడుదలైన దీని మొదటి ట్రైలర్..కొన్ని గంట్లోనే మిలియన్ల వ్యూస్ ను సంపాదించింది. అంటే ఇది ఎంత పాపులారిటీని సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు ఇంతకాలం తర్వాత ఇప్పుడు రాక్ స్టార్ గేమ్స్ ను ఈ అద్భుతమైన గేమ్ లాంఛ్ తేదీని వెల్లడించింది. కానీ స్టూడియో ఇంకా కొత్త ట్రైలర్ లేదా స్క్రీన్ షాట్స్ ను షేర్ చేయలేదు. ఈ గేమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అభిమానులతో షేర్ చేస్తామని రాక్ స్టార్ తెలిపింది.

Next Story