Robert Kiyosaka: మహా ముప్పు రోబోతోంది.. రొట్టె ముక్క.. అన్నం ముద్ద కూడా దొరకదు.. రచయిత ఇచ్చిన షాకింగ్‌ వార్నింగ్..!!

by Vennela |

Robert Kiyosaki Warning about Economic Crisis: రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్డ్ కియోసాకి రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభం గురించి తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.

Robert Kiyosaka: మహా ముప్పు రోబోతోంది.. రొట్టె ముక్క.. అన్నం ముద్ద కూడా దొరకదు.. రచయిత ఇచ్చిన షాకింగ్‌ వార్నింగ్..!!
X

దిశ, వెబ్ డెస్క్: Robert Kiyosaki Warning about Economic Crisis: రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్డ్ కియోసాకి రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభం గురించి తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆర్థిక చరిత్రలో కీలకమైన క్షణాలను కియోసాకి ఎత్తి చూపించారు. కియోసాకి తెలిపిన వివరాల ప్రకారం.. పెరుగుతున్న సమస్యలకు మూలం 1071 నాటిది. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అమెరికా డాలర్ ను బంగారు ప్రమాణం నుంచి తొలగించినప్పుడు 1.6 ట్రిలియన్ల డాలర్ల విద్యార్థి రుణ మార్కెట్ పతనం వల్ల తదుపరి సంక్షోభం ఏర్పడుతుందనే రికార్డ్స్ అభిప్రాయాన్ని ఆయన గుర్తు చేశారు. సాంప్రదాయ పొదుపు ఇకపై సురక్షితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

రాబోయే సంక్షోభం నుంచి రక్షణ పొందేందుకు ఫేక్ ఫియట్ డబ్బును ఆదా చేయడం పరిష్కారం కాదని చెప్పారు. 25ఏళ్ల క్రితం రిచ్ డాడ్ పూర్ డాడ్ లో తాను చెప్పినట్లుగా ధనికులు డబ్బు కోసం పనిచేయరు..పొదుపు చేసేవారు నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వం సహాయం కోసం వేచి ఉండటానికి బదులు..నిజమైన బంగారం, వెండి, బిట్ కాయిన్ లను ఆదా చేయడం వల్ల సంక్షోభం నుంచి బయటపడవచ్చని తెలిపారు. 2012లో రిచ్ డాడ్ ప్రపంచంలో నేను హెచ్చరించిన క్రాష్ ప్రారంభం అయ్యింది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు బెయిల్ ద్వారా బయటకు తీసుకెళ్లండంటూ కియోసాకి ఓ కఠినమైన వార్నింగ్ ఇచ్చారు.

ఈ సంక్షోభాన్ని ఎలా నివారించాలో కూడా కియోసాకి వివరించాడు. ప్రభుత్వం నుండి లేదా స్టాక్ మార్కెట్ నుండి మీకు ఎటువంటి సహాయం లభించదని చెబుతున్నాడు. మీకు మీరే సహాయం చేసుకోవాలి.మరెవరినీ నమ్మవద్దంటూ తెలిపారు.



Next Story