పెరుగుతున్న పసిడి ధరలు.. తగ్గుతున్న డిమాండ్

by Yella Dhawani Reddy |

మహిళలకు బంగారాన్ని (Gold) ఎంతో ఇష్టపడుతుంటారు. పెళ్లిళ్లలో, శుభకార్యాల్లో బంగారం కొనుగోలు, ధరించటం శుభసూచికగా భావిస్తారు.

పెరుగుతున్న పసిడి ధరలు.. తగ్గుతున్న డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: మహిళలకు బంగారాన్ని (Gold) ఎంతో ఇష్టపడుతుంటారు. పెళ్లిళ్లలో, శుభకార్యాల్లో బంగారం కొనుగోలు, ధరించటం శుభసూచికగా భావిస్తారు. ఇది సంప్రదాయానికి చిహ్నంగా మాత్రమే కాక, ఆర్థిక భద్రతకు సంకేతంగా కూడా తీసుకుంటారు. కేవలం ఆభరణంగానే కాకుండా, బంగారాన్ని పెట్టుబడిగా కూడా భావిస్తుంటారు. అందుకే గోల్డ్ కొనుగోలు విషయంలో రాజీ పడరు. కానీ, ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ధరలు ఆకాశన్నంటుతుండటంతో ఈ ఏడాది పసిడి కొనుగోళ్లు (Gold Demand) డీలా పడిపోయాయి. ఏకంగా ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోనుందని ప్రపంచ స్వర్ణ మండలి గురువారం వెల్లడించింది. పసిడి పెట్టుబడుల్లో డిమాండ్ ఉన్నప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపడం లేదని పేర్కొంది.

బంగారం వినియోగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో కూడా కొనుగోలు స్వల్పంగా ఉన్నట్లు తెలిపింది. గతేడాది మోదైన 802.8 మెట్రిక్ టన్నుల డిమాండ్‌తో పోలిస్తే.. ఈ ఏడాది గోల్డ్ డిమాండ్ 600 నుంచి 700 మెట్రిక్ టన్నుల వరకూ ఉండొచ్చని అంచనా వేసింది. ఇది 2020 నాటి కనిష్ఠస్థాయి కావడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణంగా భారీగా ధరల పెరుగుదల, కొనుగోలుదారుల కొనుగోలు సామర్థ్యాన్ని తగ్గించడం, వడ్డీ రేట్లు పెరగడం, ఆర్థిక పరిస్థితుల్లో అస్థిరత ఉండడం వంటి అంశాలున్నాయి. జూన్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర లక్ష దాటింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 28 శాతం పెరుగుదల కనిపించింది. మునుపటి ఏడాదితో పోల్చుకుంటే.. ఈ ఏప్రిల్‌-జూన్‌లో బంగారం వినియోగం 10 శాతం పడిపోయింది. ఇక ఆభరణాల డిమాండ్ 17 శాతం తగ్గగా.. అదే సమయంలో పెట్టుబడి డిమాండ్ 7 శాతం పెరిగింది.

Next Story