- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్ (Rishi Sunak )భార్యకు ఎన్ని కోట్ల ఆస్తులో తెలుసా..?
బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్ భార్య అక్షతా మూర్తికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో అని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి..Latest Telugu News

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్ భార్య అక్షతా మూర్తికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో అని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. రిషి సునక్ భార్యే కాకుండా తను, ఇండియాలో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి కుమార్తె కూడా. దీంతో ఆమెకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని వివిధ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
అక్షతా మూర్తి ప్రస్తుతం సుమారు రూ. 10.6 వేల కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారని సమాచారం. ఆమె ఇన్ఫోసిస్ షేర్లలో ఎక్కువ వాటా కలిగి ఉన్నారు. మొత్తంగా ఆమె ఇన్ఫోసిస్‌లో 3.89 కోట్ల (0.93 శాతం) షేర్లను కలిగి ఉన్నారు. కంపెనీ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్షతా మూర్తి రూ. 126.61 కోట్ల డివిడెండ్‌ను అందుకున్నారు. ఆమె ప్రస్తుతం మూడు కంపెనీలకు డైరెక్టర్‌గా అలాగే క్లేర్‌మాంట్ మకేనా కాలేజీకి ట్రస్టీగా ఉన్నారు.
- Tags
- Rishi Sunak






