కేవలం రూ. 5,715 డౌన్‌పేమెంట్‌‌‌తో రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ మీ సొంతం

by Disha Web Desk 17 |
కేవలం రూ. 5,715 డౌన్‌పేమెంట్‌‌‌తో రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ మీ సొంతం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ రివోల్ట్ మోటార్స్ ఇండియాలో RV400 ఎలక్ట్రిక్ బైక్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. 72V, 3.24KWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తున్న ఈ బైక్ ధర రూ.1.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ముందస్తు బుకింగ్ చేసుకోవాలనుకునే వారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ revoltmotors.com ద్వారా రూ. 2,499 చెల్లించి ఆర్డర్ చేసుకోవచ్చు. డెలివరీలు మాత్రం మార్చి 31, 2023 నుండి ప్రారంభమవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ బైక్‌లో ప్రత్యేకంగా స్వైప్ టు స్టార్ట్ ఫీచర్‌ను అందించారు. ఇది ఇంజిన్‌ను రిమోట్‌గా స్టార్ట్ చేయడానికి లేదా ఆపడానికి ఉపయోగపడుతుంది. బ్యాటరీ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కి.మీ తో 85 కి.మీ గరిష్ట వేగాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీని పూర్తిగా చార్జింగ్ చేయడానికి 4.5 గంటలు అవుతుంది.


యాప్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా బైక్ లోకేషన్, బైక్ డయాగ్నస్టిక్స్, బ్యాటరీ స్టేటస్, రైడ్‌ హిస్టరీ ప్రయాణించిన కిలోమీటర్ల వంటి వాటిని చూపిస్తుంది. ఇంకా బైక్‌లో LED హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కీలెస్ ఇగ్నిషన్ మొదలగు ఫీచర్లు ఉన్నాయి.

ఇది మిస్ట్ గ్రే, రెబెల్ రెడ్, కాస్మిక్ బ్లాక్ అనే మూడు కలర్స్‌లో లభిస్తుంది. RV400 ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ ఒక ఆఫర్‌ను అందిస్తుంది. రూ. 5,715 డౌన్‌పేమెంట్‌‌ను చెల్లించడం ద్వారా బైక్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది.


Next Story

Most Viewed