Retail Sector: ఐదేళ్లలో రిటైల్ రంగం వృద్ధి డబుల్

by S Gopi |

దేశంలో ఈ రంగం ఏటా 10 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తోంది.

Retail Sector: ఐదేళ్లలో రిటైల్ రంగం వృద్ధి డబుల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రిటైల్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యం తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బఫర్‌గా పనిచేసే మనదేశ మార్కెట్ ఇందుకు ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారత రిటైల్ రంగం దాదాపు 1.93 ట్రిలియన్ డాలర్ల(రూ. 168 లక్షల కోట్ల)తో రెట్టింపునకు చేరుకుంటుందని డెలాయిట్-ఫిక్కీ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2024లో స్పాటింగ్ ఇండియాస్ ప్రైమ్ ఇన్నోవేషన్ మూమెంట్ నివేదిక ప్రకారం, దేశ రిటైల్ రంగం రూ. 75 లక్షల కోట్లుగా ఉంది. దేశంలో ఈ రంగం ఏటా 10 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రధానంగా డిజిటల్ వినియోగం, ప్రీమియమైజేషన్‌తో పాటు పట్టణ, ఇతర ప్రాంతాల్లో ఈ-కామర్స్ వృద్ధి వేగంగా విస్తరిస్తుండటం, వినియోగం బలంగా ఉండటంతో రిటైల్ రంగానికి కలిసి వస్తుంది. జెన్‌జీ తరం ఖర్చుకు వెనుకాడకపోవడంతో కొనుగోలు శక్తి, డిమాండ్ పటిష్టంగా ఉందని నివేదిక వెల్లడించింది. ఇటీవల పలు దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు పెరుగుతుండటం, సుంకాల విషయంలో సానుకూలంగా మారుతుండటం, ఎగుమతుల్లో ప్రపంచ బ్రాండ్లతో మన దేశ ఉత్పత్తులు పోటీ పడుతున్నాయి. దీనివల్ల మేడ్-ఇన్-ఇండియా వస్తువులకు కొత్త మార్కెట్లు లభిస్తున్నాయని డెలాయిట్ తెలిపింది. ప్రస్తుతం దేశ ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాలు కొత్త దశకు మారుతున్నాయి. డిజిటల్-ఫస్ట్, ప్రీమియమైజేషన్, క్విక్ కామర్స్ విస్తరణ ద్వారా వృద్ధి వేగవంతంగా కొనసాగుతుందని నివేదిక పేర్కొంది.

Next Story