- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Renault Group: రెనాల్ట్ నిస్సాన్ ఇండియాలో మిగిలిన వాటాను కొనుగోలు చేయనున్న రెనాల్ట్
వాటా కొనుగోలు తర్వాత కూడా ఇరు సంస్థలకు చెందిన ప్రస్తుతం ప్రాజెక్టులు కొనసాగుతాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనాల్ట్ తన భారతీయ జాయింట్ వెంచర్ అయిన రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో జపాన్‌కు చెందిన నిస్సాన్ వాటాను కొనుగోలు చేయనున్నట్లు సోమవారం తెలిపింది. ప్రస్తుతం నిస్సాన్ వద్ద ఉన్న 51 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియాలో రెనాల్ట్ గ్రూప్ పూర్తిగా 100 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే, రెనాల్ట్ గ్రూప్, నిస్సాన్ మధ్య ఈ మేరకు వాటా కొనుగోలు ఒప్పందం జరిగినట్టు స్పష్టం చేశాయి. వాటా కొనుగోలు తర్వాత కూడా ఇరు సంస్థలకు చెందిన ప్రస్తుతం ప్రాజెక్టులు కొనసాగుతాయి. రానున్న సంవత్సరాల్లో నిస్సాన్ కంపెనీ భారత మార్కెట్‌తో పాటు ఎగుమతుల కోసం రెనాల్ట్ నిసాన్ ఆటోమోటివ్ తయారీ ప్లాంటును ఉపయోగిస్తుంది. ఇరు సంస్థల సంయుక్త కార్యకలాపాల ద్వారా నిస్సాన్ మాగ్నైట్, ఇతర మోడళ్ల ఉత్పత్తిని కూడా కొనసాగించనున్నారు. ఈ ఒప్పందంపై మాట్లాడిన నిస్సాన్ సీఈఓ ఇవాన్ ఎస్పినోసా.. తమ కంపెనీ ఆర్అండ్‌డీ, డిజిటల్, ఇతర నాలెడ్జ్ సేవలకు భారత మార్కెట్ కేంద్రంగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో కస్టమర్ల కోసం కొత్త ఎస్‌యూవీల ప్రణాళిక, తయారీ కొనసాగుతాయని పేర్కొన్నారు.






