Renault Duster: మార్కెట్లోకి డస్టర్ రీ-ఎంట్రీ

by S Gopi |

ఈ ఎస్‌యూవీ ధర రూ. 10.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, అయితే ప్రీ-బుకింగ్‌పై రూ. 10.29 లక్షలకే లభిస్తుందని కంపెనీ తెలిపింది.

Renault Duster: మార్కెట్లోకి డస్టర్ రీ-ఎంట్రీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వాహన మార్కెట్లో ఎస్‌యూవీలకు క్రేజ్ పెరగడానికి కారణమైన రెనాల్ట్ డస్టర్ మోడల్ తిరిగి దేశంలోని రీ-ఎంట్రీ ఇచ్చింది. మంగళవారం కంపెనీ తన సరికొత్త రెనాల్ట్ డస్టర్ 2026ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ధర రూ. 10.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, అయితే ప్రీ-బుకింగ్‌పై రూ. 10.29 లక్షలకే లభిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రీమియం వేరియంట్ ధర రూ. 18.09 లక్షలుగా నిర్ణయించింది. బుకింగ్స్ ప్రారంభవగా, ఏప్రిల్ నుంచి డెలివరీలు మొదలవుతాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ 160 వేరియంట్ దీపావళి నాటికి అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. రీ-ఎంట్రీ డస్టర్‌లో 6 ఎయిర్‌బ్యాగులతో పాటు ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, లెవల్‌ 2 సహా అనేక రకాల సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. గ్లోబల్ మోడల్‌తో పోలిస్తే మనదేశంలో విడుదలైన వేరియంట్‌ హెడ్‌ల్యాంప్‌ డిజైన్‌, ఐబ్రో డిజైన్ డీఆర్‌ఎల్‌ఎస్‌ మార్పులతో రావడం గమనార్హం.

Next Story