SEBI: సెబీ మాజీ చీఫ్ మాధవి బుచ్‌కు బాంబే హైకోర్టు ఉపశమనం

by S Gopi |

ఈ మేరకు నాలుగు వారాల పాటు ఏసీబీ కోర్టు ఉత్తర్వులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

SEBI: సెబీ మాజీ చీఫ్ మాధవి బుచ్‌కు బాంబే హైకోర్టు ఉపశమనం
X

దిశ, బిజినెస్ బ్యూరో: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్‌తో పాటు మరో ఐదుగురు అధికారులకు బాంబే హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. స్టాక్ మార్కెట్లో అవకతవకలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలపై మంగళవారం హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు నాలుగు వారాల పాటు ఏసీబీ కోర్టు ఉత్తర్వులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ శివకుమార్ డిగే అధ్యక్షతన జరిగిన విచారణలో హైకోర్టు పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించకుండా స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్టు గమనించామని, ఇరువురి వాదనలు విన్న తర్వాత స్టే ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. సెబీ అధికారుల పిటిషన్‌లకు సమాధానంగా అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ఫిర్యాదుదారు (సపన్ శ్రీవాస్తవ)కు నాలుగు వారాల సమయం ఇస్తున్నామని హైకోర్టు పేర్కొంది. కాగా, స్టాక్ మార్కెట్లలో కంపెనీలను లిస్టింగ్ చేసే సమయంలో భారీగా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని థానేకు చెందిన జర్నలిస్ట్ సపన్ శ్రీవాస్తవ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ స్పెషల్ కోర్టు సెబీ చీఫ్ మాధవి బుచ్ సహా ఐదుగురు ఉన్నతాధికారులపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలిచ్చింది.

Next Story