LPG కష్టాల నుంచి భారత్‌కు ఊరట.. అర్జెంటీనా ఆపన్నహస్తం

by Kema Shiva Kumar |

పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో ఏర్పడిన ఎల్‌పీజీ (LPG) కొరతను తీర్చేందుకు 20,000 కిలోమీటర్ల దూరం నుంచి ఓ దక్షిణ అమెరికా దేశం అండగా నిలిచింది.

LPG కష్టాల నుంచి భారత్‌కు ఊరట.. అర్జెంటీనా ఆపన్నహస్తం
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా భారత్‌లో ఏర్పడిన ఎల్‌పీజీ (LPG) కొరతను తీర్చడానికి అర్జెంటీనా ( Argentina) ముందుకొచ్చింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడిన వేళ సుమారు 20వేల కి.మీ దూరంలో ఉన్న ఈ దక్షిణ అమెరికా దేశం భారత్‌కు భారీగా గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. అయితే, 2026 మొదటి త్రైమాసికంలోనే అర్జెంటీనా భారత్‌కు 50 వేల టన్నుల ఎల్‌పీజీని ఎగుమతి చేసింది. ఇది 2025లో చేసిన మొత్తం సరఫరా కంటే రెట్టింపు కంటే ఎక్కువ కావడం విశేషం.

యుద్ధం ప్రభావంతో..

భారత్ తన ఎల్‌పీజీ (LPG) అవసరాల్లో దాదాపు 60 శాతం హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల ఈ మార్గం మూతపడటంతో ప్రత్యామ్నాయాల కోసం వెతికింది. అర్జెంటీనాలోని బహియా బ్లాంకా పోర్ట్ నుంచి గుజరాత్‌ (Gujarat)లోని దహేజ్ పోర్ట్‌కు ఉన్న దూరం 20 వేల కి.మీ. కాగా ఇది ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఇంధన రవాణా మార్గాలలో ఒకటి నిలిచింది. కానీ, దీంతో రవాణా ఖర్చులు కూడా బాగానే పెరుగనున్నాయి. కేవలం ఎల్‌పీజీయే కాకుండా, హైడ్రోకార్బన్ రంగంలో కూడా భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అర్జెంటీనా సిద్ధంగా ఉందని ఆ దేశ రాయబారి మరియానో అగస్టిన్ కుసినో తెలిపారు.

Next Story